ఒక్క రూపాయికే రూ. 23,999 విలువైన స్మార్ట్ ఫోన్.. లిమిటెడ్ ఆఫర్!

ఒక్క రూపాయికే రూ. 23,999 విలువైన స్మార్ట్ ఫోన్.. షరతులు వర్తిస్తాయంటున్న సంస్థ!

Updated: Oct 24, 2018, 12:14 AM IST
ఒక్క రూపాయికే రూ. 23,999 విలువైన స్మార్ట్ ఫోన్.. లిమిటెడ్ ఆఫర్!

మొబైల్‌ మార్కెట్‌లో తక్కువ కాలంలోనే ఎక్కువ అమ్మకాలు సొంతం చేసుకున్న చైనీస్‌ దిగ్గజం షియోమి సబ్‌బ్రాండ్‌ పోకో విడుదల చేసిన పోకో ఎఫ్‌1 స్మార్ట్‌ఫోన్‌పై ఎంఐ కంపెనీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.  దీపావళి ఆఫర్‌ కింద రూ.1 ఫ్లాస్ సేల్ పేరిట అక్టోబర్‌ 23, 25 తేదీల్లో పోకో ఎఫ్1 మొబైల్‌ని కేవలం రూ.1 కే విక్రయించనున్నట్టు సంస్థ తెలిపింది. 6జీబీ ర్యామ్‌, 128జీబీ వేరియంట్‌ ధర రూ. 23,999గా ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌ను ఒక్క రూపాయికే విక్రయించనున్నట్టు ఎంఐ ప్రకటించడం సంచలనం సృష్టించింది. అయితే, కంపెనీ వెబ్‌సైట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం కేవలం 10 యూనిట్స్ మాత్రమే ఈ ఒక్క రూపాయికి అందుబాటులో ఉండనున్నాయనే విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. 

1080x2160  పిక్సెల్స్‌రిజల్యూషన్‌‌తో 6.18 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉన్న పోకో  ఎఫ్‌ 1 స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 845 సిస్టం ఆన్ చిప్‌ను, 4000ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 12+5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఈ POCO F1 మొబైల్ సొంతం.

మొదటి సేల్‌లో భాగంగా అక్టోబర్ 23న.. అంటే మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు రూ.1కే ఈ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చుని కంపెనీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈమేరకు ఎంఐ తమ వెబ్‌సైట్‌లో కౌంట్‌డౌన్ సైతం మొదలుపెట్టింది. ఇవే కాకుండా ఎంఐకి చెందిన ఇతర స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ టీవీలు, బ్లూటూత్ స్పీకర్స్, హోం సెక్యురిటీ కెమెరాలు, ఎంఐ బ్యాండ్ వాచెస్, ఎయిర్ ప్యూరిఫయర్, ట్రావెల్ బ్యాగ్స్‌పై సైతం అనేక ఆఫర్లు అందుబాటులో ఉన్నట్టు ఎంఐ తెలిపింది.