Night Sleep: ప్రతిరోజు రాత్రి ఇలా నిద్రపోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు..ఈ సీక్రెట్ మీరు కూడా తెలుసుకోండి!

3 Benefits Of A Good Night Sleep: ప్రతిరోజు 8 గంటల పాటు నిద్రపోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండెపోటు సమస్యలు రాకుండా ఉంటాయని వారు అంటున్నారు. ఇవే కాకుండా శరీరానికి మరిన్ని లాభాలు కలుగుతాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 18, 2023, 01:16 PM IST
Night Sleep: ప్రతిరోజు రాత్రి ఇలా నిద్రపోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు..ఈ సీక్రెట్ మీరు కూడా తెలుసుకోండి!

3 Benefits Of A Good Night Sleep: సరైన నిద్ర శరీరానికి ఎంతో అవసరం.. శరీరం ఆరోగ్యంగా, చురుకుగా పనిచేయాలంటే సరైన సమయంలో నిద్ర పోవడం మంచిది. బాడీ హెల్తీగా ఉండడానికి ప్రతిరోజు 7 నుంచి 8 గంటలపాటు తప్పకుండా నిద్రపోవాలని ఆరోగ్యానికి నువ్వు చెబుతున్నారు ప్రస్తుతం ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు అయితే ఈ సమస్య కారణంగా భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు కాబట్టి శరీరం తగినంత విశ్రాంతి కోసం ప్రతి రోజు తప్పకుండా ఏడు గంటల పాటు నిద్ర పోవాల్సిందే. ప్రతిరోజు సరైన సమయంలో నిద్ర పోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ ప్రయోజనాలు ఏమిటో? ఏయే సమయాల్లో నిద్రపోతే మంచి ఫలితాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

నిద్ర వల్ల కలిగే లాభాలు:
రక్త ప్రసరణ మెరుగుపడుతుంది:

సరైన నిద్రలేని వారిలో తరచుగా రక్త సమస్యలు వస్తూ ఉంటాయి. అంతే కాకుండా జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతిరోజు సరైన మోతాదులో నిద్రపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు 8 గంటల పాటు నిద్రపోవడం వల్ల శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థ మెరుగు పడుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?

మెదడులో గణాలు క్లీన్ అవుతాయి:
చాలామందికి తెలియనిది ఏమిటంటే మెదడులోని గణాల్లో చాలావరకు వ్యర్థ పదార్థాలను నిండి ఉంటాయి. అయితే ఇవి ఎక్కువగా నిండిపోవడం వల్ల భవిష్యత్తులో అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి రోజు 8 గంటల చొప్పున నిద్రపోవాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల మెదడులోని గణాల్లో పేరుకుపోయిన వ్యర్ధాలన్నీ బయటికి వస్తాయి.

గుండె ఆరోగ్యం కోసం:
ప్రస్తుతం చాలామందిలో చిన్న వయసులోనే గుండెపోటు సమస్యలు వస్తున్నాయి దీనికి కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి రోజు సరైన మోతాదులో నిద్రపోవాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండడమే కాకుండా శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కొంతమందిలో కండరాల సమస్యలు కూడా వస్తున్నాయి. కండరాలు బలహీనంగా మారి శరీరం తీవ్రంగా దెబ్బతింటుంది. దీనికి ప్రధాన కారణం సరైన నిద్ర లేకపోవడం వల్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కండరాల బలహీనత సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు 8 గంటల పాటు తప్పకుండా నిద్ర పోవాల్సిందే.

ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News