2019 డిసెంబర్ నెలలో చైనాలో మొదలై ప్రపంచాన్ని హడలెత్తించి లక్షలాదిమందిని పొట్టన బెట్టుకున్న ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్. అప్పట్నించి ఏదో మూల ఏదో ఒక వైరస్ వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు మరో కొత్త వైరస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని పీడిస్తోంది. ముఖ్యంగా చిన్నారుల్ని టార్గెట్ చేస్తోంది ఈ వైరస్.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని వణికిస్తున్న ఈ వైరస్ పేరు అడినో వైరస్. కరోనా వైరస్‌తో దీనికి సంబంధముందా లేదా అనేది ఇంకా తెలియదు. కానీ తీవ్రంగా వణికిస్తోంది. ముఖ్యంగా చిన్నారుల్ని లక్ష్యంగా చేసుకుంది. రాష్ట్రంలో కేవలం 9 రోజుల్లో 36 మంది పిల్లలు అడినో వైరస్ బారినపడి మరణించినట్టు పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖే ప్రకటించింది. కేవంల ఆరేళ్లలోపు పిల్లలపై ఈ వైరస్ ప్రతాపం చూపిస్తోంది. నెలల వయస్సు శిశువులకు కూడా సోకుతుండటం ఆందోళన కల్గిస్తోంది. సాధారణ ఫ్లూ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న పిల్లల్లో ఎక్కువగా ఈ వైరస్ కన్పిస్తోంది.
అడినో వైరస్ లక్షణాలు
ఈ వైరస్ సోకినవారిలో సాధారణ జలుబు, గొంతు మంట, కళ్ల కలక, కడుపునొప్పి, తీవ్రమైన బ్రాంకైటిస్, నిమోనియా వంటి లక్షణాలుంటాయి. గుండె సంబంధిత సమస్యలు, శ్వాసకోశ వ్యాధుల ఇబ్బందులున్నవాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలి.
ఈ వైరస్ సోకితే మెదడు వ్యవస్థ, మూత్ర నాళాలు, కళ్లు, ఊపిరితిత్తులు, పేగులకు హాని కలుగుతుంది. ఇది ఇతర వైరస్‌లానే అంటువ్యాధి. ఇదొక శ్వాసకోశ వైరస్ అని చెప్పవచ్చు. జలుబుతో మొదలై తీవ్ర అనారోగ్యం, శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. చర్మం, గాలి, నీరు ద్వారా విస్తరిస్తుంది. దగ్గు, తుమ్ము ద్వారా ఎదుటి వ్యక్తులకు అంటుకుంటుంది.
అడినో వైరస్‌కు ఇప్పటి వరకూ ఏ విధమైన మందు కనిపెట్టలేదు. సాధారణ జలుబు, జ్వరం, నిమోనియాలకు వాడే మందులే ఇస్తున్నారు. కోవిడ్ సమయంలో ఎలాంటి రక్షణ అవసరమో అవే జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా మహమ్మారి విషయంలో తీసుకునే జాగ్రత్తలన్నీ పాటించాలి. ఈ వ్యాధి నుంచి రక్షించుకునేందుకు ఇమ్యూనిటీ పెంచుకోవడమే తక్షణ కర్తవ్యం. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఈ వ్యాధి దరిచేరదు. దీనికోసం విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మకాయ, ఆరెంజ్, స్ట్రాబెర్రీ, క్యారెట్, అల్లం, బీన్స్, వెల్లుల్లి, ఆకుకూరలు తరచూ తీసుకోవాలి.
Also read: Heart Attack Signs: గుండెపోటుకు ముందు ఈ సంకేతాలు ప్రమాదం, నిర్లక్ష్యం ప్రాణాంతకమే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook