High Blood Pressure Control: ఈ రెండు ప్రాణాయామాలతో High BPకి శాశ్వతంగా చెక్‌..

High Blood Pressure Control Exercise: అధిక రక్తపోటు కారణంగా చాలా మంది గుండె సమస్యల బారన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ కింది ప్రాణాయామాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 26, 2023, 04:58 PM IST
High Blood Pressure Control: ఈ రెండు ప్రాణాయామాలతో High BPకి శాశ్వతంగా చెక్‌..

 

Pranayama For High Blood Pressure: హైపర్‌టెన్షన్‌ ప్రస్తుతం సైలెంట్ కిల్లర్‌గా మారింది. చిన్న పెద్ద తేడా లేకుండా ఆధుని జీవనశైలిని అనుసరించే చాలా మంది దీని బారిన పడుతున్నారు. ఈ సమస్య ఊబకాయం, ధూమపానం, అధిక ఒత్తిడి సమస్యలు ఉన్నవారిలో సులభంగా వస్తోంది. కాబట్టి వీటి నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే హైపర్‌టెన్షన్‌ కారణంగా గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి రోజు ఈ ప్రాణాయామాలు చేయండి.

అధిక రక్తపోటు లక్షణాలు:
❃ తరచుగా ఛాతీ నొప్పి 
❃ తలనొప్పి
❃ అలసటగా అనిపించడం
❃ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
❃ తల తిరగడం 

Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా  

అధిక రక్తపోటు తగ్గించుకోవడానికి ప్రాణాయామాలు:
అనులోమ్ విలోమ్:

ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో అనులోమ్ విలోమ్ సాధనలు చేయడం వల్ల ఊపిరితిత్తులు బలంగా మారుతాయి. అంతేకాకుండా  శరీరంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల శ్వాసకోశ వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయి. ప్రతి రోజు ఈ ప్రాణాయామాలు చేసేవారిలో ఒత్తిడి, మానసిక సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా అధిక రక్తపోటు కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ అనులోమ్ విలోమ్ సాధనలు చేయాల్సి ఉంటుంది. 

భ్రమరీ ప్రాణాయామం:
భ్రమరీ ప్రాణాయామం చేయడం కూడా శరీరానికి చాలా మందిని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  థైరాయిడ్, సైనస్, మైగ్రేన్‌తో పాటు ఒత్తిడి సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. తరచుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా భ్రమరీ ప్రాణాయామాన్ని చేయాల్సి ఉంటుంది. ఇది చేయడం వల్ల  రక్తపోటు కూడా సులభంగా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా గుండె  జబ్బుల బారిన పడకుండా ఉంటారిని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News