Apples For Bad Cholesterol: యాపిల్స్ మన శరీరానికి ఎంతో మంచిది.. వీటిని ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలగడమే కాకుండా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులనుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం చాలామంది ఉదయం పూట అల్పాహారానికి ముందు ఎక్కువగా యాపిల్స్ ని తింటూ ఉంటున్నారు. ఇలా ప్రతిరోజూ తినడం వల్ల శరీరానికి అద్భుత ప్రయోజనాలు లభించడమే కాకుండా కొన్ని అనారోగ్య సమస్యల నుంచి శరీరానికి ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు యాపిల్స్ ని తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
యాపిల్ పండ్లతో చెడు కొలెస్ట్రాల్ కు చెక్..
ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో కొలెస్ట్రాల్ పెరిగి శరీరానికి సైలెంట్ కిల్లర్ గా మారుతోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం కారణంగా చాలామందిలో కొలెస్ట్రాల్ విచ్చలవిడిగా పెరుగుతోంది. దీని కారణంగా ఎంతోమంది దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం గుండె జబ్బులు బరువు పెరగడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ఎంత సులభంగా వీలైతే అంత సులభంగా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
అయితే చెడు కొలస్ట్రాల సమస్యలతో బాధపడేవారు ఎలాంటి వ్యాయామాలు లేకుండా సులభంగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునేవారు ప్రతిరోజు తప్పకుండా ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలకు తప్పకుండా దూరంగా ఉండాలి. అంతేకాకుండా ఉదయం పూట ఖాళీ కడుపుతో అల్పాహారానికి బదులుగా యాపిల్ పండ్లను తీసుకోవడం వల్ల సులభంగా చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
యాపిల్‌లో ఉండే పాలీఫెనాల్ మూలకాలు శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించడమే కాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. దీంతోపాటు బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు యాపిల్స్ ని తీసుకోవడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యాపిల్స్ తినని వారు వాటిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకుని జ్యూస్ లా తయారు చేసుకొని కూడా తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాలను నియంత్రించుకోవచ్చని వారంటున్నారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి