Soak Rice: అన్నం వండే ముందు ఇలా చేయండి.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.. బరువు కూడా..

Soak Rice before cooking: సాధారణంగా అన్నం వండేటప్పడు గబగబా బియ్యం కడిగేసి రైస్‌కుక్కర్లో లేదా స్టవ్‌ పైనో పెట్టేసి వండుతాం. అయితే, మన అమ్మమ్మలు బియ్యాన్ని వండేటప్పుడు మందుగా నానబెట్టేవారు.

Written by - Renuka Godugu | Last Updated : May 21, 2024, 10:30 AM IST
Soak Rice: అన్నం వండే ముందు ఇలా చేయండి.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.. బరువు కూడా..

Soak Rice before cooking: సాధారణంగా అన్నం వండేటప్పడు గబగబా బియ్యం కడిగేసి రైస్‌కుక్కర్లో లేదా స్టవ్‌ పైనో పెట్టేసి వండుతాం. అయితే, మన అమ్మమ్మలు బియ్యాన్ని వండేటప్పుడు మందుగా నానబెట్టేవారు. ఇలా చేయడం వల్ల బియ్యం త్వరగా ఉడుకుతుంది. ప్రస్తుతం ఉన్న బిజీ వల్ల ఇలా చేయటేకపోతున్నారు. త్వరగా భోజనం వండటానికి రైస్‌ కుక్కర్, ప్రెజర్ కుక్కర్‌లో వండుకుంటున్నారు. అయితే, ఇలా ముందుగా నానబెట్టడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

మనం రోజు అన్నం వండుకుని మధ్యాహ్నం లంచ్‌లో తీసుకుంటాం. ఆ సమయంలో అన్నం కూరలు కలిపి తింటాం. అయితే, తిన్న వెంటనే  నిద్ర పడుతుంది. దీనివల్ల బరువు కూడా పెరుగుతారు. అయితే, ఒక వార్త సంస్థ నివేధిక ప్రకారం అన్నం వండేటప్పుడు ముందుగా నానబెట్టాలట. ఇందులో ఉండే జీఐ ప్రభావితం కాకుండా ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. బరువు కూడా పెరగకుండా ఉంటారు. ఎందుకంటే అన్నం వండినప్పుడు ఇందులో ఉండే కార్బొహైడ్రేట్స్‌ వెంటనే చక్కెరలు మారిపోతాయి. ఇలా కాకుండా చేయడానికి బియ్యం వండేటప్పుడు ముందుగా నానబెటితే మంచిదట. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. సాధారణంగా షుగర్‌ వ్యాధిగ్రస్థులకు అన్నం విషం వంటిది అంటారు. అందుకే డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినకూడదు. ఇందులో ఉండే కార్బొహైడ్రేట్స్‌ షుగర్‌ లెవల్స్ హఠాత్తుగా పెంచేస్తాయి. అందుకే అన్నం తక్కువ మోతాదులో తినాలని వైద్యులు సూచిస్తారు. 

ఇదీ చదవండి:  అతిగా తిని ఆయాసపడుతున్నారా? ఈ ఒక్కటి నోట్లో వేసుకోండి హాయిగా జీర్ణం అయిపోతుంది..

ఈ విధంగా అన్నం వండేటప్పుడు ముందుగా నానబెడితే షుగర్ వ్యాధిగ్రస్థులకు కూడా మంచిది. ఈ పద్ధతిలో అన్నం వండుకుని డయాబెటిస్‌ పేషంట్లు తింటే ఆరోగ్యకరం. దీంతో అన్నం తినగానే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. సాధారణంగా కొంత మంది అన్నం తిన్న వెంటనే బరువు పెరుగుతారు. అందుకే చాలా మంది అన్నం తినకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలా వండే ముందు బియ్యం నానబెడితే బరువు కూడా పెరగకుండా ఉంటారు.

ఇదీ చదవండి: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 అప్పుడైనా తింటూ ఉండండి.. రాళ్ల సమస్య కూడా రాదు..

గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనివ్వకుండా కాపాడతాయి. ఇందులో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఆహారం తిన్న వెంటనే మన శరీరంలో విచ్ఛిన్నం అవుతాయి. దీన్ని జీఐ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కాపాడుతుంది. ఇక పై అన్నం వండుకునేటప్పుడు ముందుగా బియ్యం నానబెట్టాలి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News