Healthy Meal Plan: రోజుకు ఎన్నిసార్లు తింటున్నారు.. మీ 'మీల్స్' నంబర్‌ను బట్టి మీరు యోగి, భోగి లేదా రోగి అవుతారట..

Healthy MEAL Plan: మీరు రోజుకు ఎన్నిసార్లు తింటారు.. నాలుగుసార్లా, మూడుసార్లా, లేక కేవలం ఒక్కసారేనా... మీ మీల్స్ నంబర్‌ను బట్టి మీరు యోగి భోగి లేదా రోగి అవుతారట..

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 10, 2022, 08:49 AM IST
  • హెల్తీ మీల్ ప్లాన్
  • రోజుకు ఎన్నిసార్లు తింటే మంచిది
  • ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారు
Healthy Meal Plan: రోజుకు ఎన్నిసార్లు తింటున్నారు.. మీ 'మీల్స్' నంబర్‌ను బట్టి మీరు యోగి, భోగి లేదా రోగి అవుతారట..

Healthy MEAL Plan: ఏం తింటున్నాం.. ఎంత తింటున్నాం.. మనిషి ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యం. ఆయుర్వేద నిపుణులు డా.డింపుల్ జంగ్డా ప్రకారం.. ఏ వ్యక్తి అయినా శరీర బరువును, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహారం తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారమే మనల్ని యోగిని, భోగిని లేదా రోగిని చేస్తుంది. ఇంతకీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి రోజుకు ఎన్నిసార్లు తినాలి.. లావుగా లేదా సన్నగా ఉన్న వ్యక్తి రోజుకు ఎన్నిసార్లు తినాలి.. దీనిపై డా.డింపుల్ జంగ్డా ఏమంటున్నారో చూద్దాం..

రోజుకు 4 మీల్స్ 

మీరు చాలా సన్నగా ఉన్నట్లయితే.. ఆకలి సరిగా వేయనట్లయితే.. మీ భోజనాన్ని నాలుగు భాగాలుగా విభజించుకుని కొంచెం కొంచెంగా నాలుగుసార్లు భోజనం చేయాలి. మీరు బొద్దుగా లేదా లావుగా ఉన్నా ఇదే డైట్ ఫార్ములా ఫాలో అవాలి. ఆకలిగా ఉన్నప్పుడు తప్పనిసరిగా తినాలి. అలా అని కడుపు నిండా తినేయొద్దు. 80 శాతం మాత్రమే తినాలి. సూర్యాస్తమయం తర్వాత ఎక్కువగా తినొద్దు. నిద్రకు ఉపక్రమించే 2-3 గంటల ముందే డిన్నర్ పూర్తి చేయాలి. ఒకవేళ నిద్రకు ఉపక్రమించే సమయంలో ఆకలిగా ఉంటే మొక్కల ఆధారిత లేదా మిల్క్ తీసుకోవాలి. డైరీ ఆధారిత మిల్క్ కూడా తీసుకోవచ్చు. కాస్త నట్‌మెగ్ లేదా పసుపు కలిపి తీసుకుంటే రోగ నిరోధక వక్తి పెరుగుతుంది. రోజుకు నాలుగు మీల్స్ తీసుకోవడం వల్ల స్నాక్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

రోజుకు 3 మీల్స్ 

మీరు పూర్తి ఆరోగ్యవంతులైతే రోజుకు 3 సార్లు భోజనం చేయాలి. ఉదయం కొద్దిగా బ్రేక్‌ ఫాస్ట్, మధ్యాహ్నం సరిపోయేంత భోజనం, రాత్రికి కాస్త తక్కువ భోజనం చేయాలి. సూర్యాస్తమయం కన్నా ముందే డిన్నర్ పూర్తి చేయాలి. అయితే ఆయుర్వేద ప్రకారం ఇలా రోజుకు 3 సార్లు భోజనం చేసేవారిని 'రోగి' అని పిలుస్తారట. ఆయుర్వేదం ప్రకారం రోజుకు ఎన్ని మీల్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.. ఆరోగ్యవంతులు రోజుకు ఎన్ని మీల్స్ తీసుకోవాలి.. 

రోజుకు 2 మీల్స్

యోగా, ఆయుర్వేద ప్రకారం రోజుకు 2 మీల్స్ తీసుకోవడమనేది సరైనది. రెండు మీల్స్‌కు మధ్యన 6 గంటల గ్యాప్ ఉండాలి. తద్వారా రెండో మీల్స్ సమయానికి మీరు మొదట తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. యోగా ప్రకారం ఇలా రోజుకు రెండు మీల్స్ తీసుకునేవారిని 'భోగి' అని పిలుస్తారు. అంటే ఆహారాన్ని ఆస్వాదించేవారు అని అర్థం.

రోజుకు కేవలం ఒక్క మీల్ మాత్రమే

ఒక మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో, జీవక్రియలన్నీ ఆరోగ్యవంతంగా ఉన్నట్లయితే రోజుకు కేవలం ఒక్క మీల్ మాత్రమే తీసుకోవచ్చునని తెలిపింది. అలాంటి వ్యక్తిని 'యోగి'గా పిలుస్తారని పేర్కొంది. ఈ వ్యక్తులు తీవ్రమైన ఆలోచనలు, మేధ, ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారని తెలిపింది. 

Also Read: Horoscope Today September 10th 2022: నేటి రాశి ఫలాలు... ఈ రాశి వారు ఏ పని చేట్టినా ప్రతికూలత ఎదురవుతుంది..  

Also Read: Ganesh Immersion: గణేశ్ నిమజ్జన వేడుకల్లో విషాదం... నీట మునిగి ఏడుగురు మృతి...  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News