Ayurvedic tips for constipation: దీర్ఘకాలికంగా మలబద్ధకంతో బాధపడుతున్నారా? ఈ ఆయుర్వేదిక్ చిట్కాతో తక్షణమే చెక్ పెట్టండి..

Ayurvedic tips for constipation: మలబద్ధకం ఈ కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య. దీంతో పేగు ఆరోగ్యం కుంటుపడుతుంది. నిద్రలేమి, ఇతర అనారోగ్య సమస్యల వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది.

Written by - Renuka Godugu | Last Updated : Mar 23, 2024, 12:34 PM IST
Ayurvedic tips for constipation: దీర్ఘకాలికంగా మలబద్ధకంతో బాధపడుతున్నారా? ఈ ఆయుర్వేదిక్ చిట్కాతో తక్షణమే చెక్ పెట్టండి..

Ayurvedic tips for constipation: మలబద్ధకం ఈ కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య. దీంతో పేగు ఆరోగ్యం కుంటుపడుతుంది. నిద్రలేమి, ఇతర అనారోగ్య సమస్యల వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. మలబద్ధకం సమస్య ప్రతిరోజూ మీ డైలీ లైఫ్ పై ప్రభావం చూపుతుంది. దీనికి ముఖ్యంగా లైఫ్ స్టైల్‌లో మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌ పుష్కలంగా ఉండే ఆహారాలు, ప్రోబయోటిక్స్ డైట్లో చేర్చుకోవాలి. అంతేకాదు అల్లం, త్రిఫల, కూరగాయలు, ఆర్గానికి నూనెలు, మసాలాలు కూడా డైట్లో చేర్చుకుంటే దీర్ఘకాలిక మలబద్దకం సమస్య నుంచి బయటపడొచ్చు. ఆయుర్వేదం ప్రకారం వాత దోషంలో అసమతుల్యత వల్ల ఏర్పాడుతుంది. సరిగ్గా నీరు తీసుకోకపోవడం. బ్యాడ్‌ లైఫ్ స్టైల్, మాంసం ఎక్కువగా తీసుకునేవారిలో మలబద్ధకం సమస్య ఉంటుంది.

మలబద్ధకం సమస్య వల్ల కడుపులో ఉబ్బరం, నొప్పి, తలనొప్పి, గాలితీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. వాత దోషాన్ని సమతుల్యం చేసుకుంటే మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఆయుర్వేదంలో కొన్ని ముఖ్యమైన మసాలాలు, మూలికలు చేర్చుకుంటే వాత దోషం సమస్య తగ్గిపోతుంది.

బాదం..
బాదంతో మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఆయుర్వేద ప్రకారం బాదంలో ఫార్మాకలాజికల్ లక్షణాలు ఉంటుఆయి.  బాదం రాత్రి నానబెట్టి పరగడుపున తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక మలబద్ధకం సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. డైలీ ఒక గుప్పెడు బాదం తీసుకుంటే దీర్ఘకాలికంగా మలబద్ధకం సమస్యతో పడేవారు సమస్య నుంచి బయటపడతారు.

ఇదీ చదవండి: వేయించిన శనగలతో వేయి లాభాలు.. పిడికెడు తింటే పురుషులకు దివ్యౌషధం..

ఆర్గానిక్ ఆయిల్.. 
ఆర్గానిక్ ఆయిల్స్ తో మలబద్దకం సమస్యతో చెక్ పెట్టొచ్చు. నువ్వుల నూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్ డైట్లో చేర్చుకుంటే మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టొచ్చు. నెయ్యిలో బటైరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది బాడీ మెటబాలిజం రేటును పెంచుతుంది.

పండ్లు..
వాత దోషం తగ్గించుకోవడానికి కొన్ని రకాల పండ్లను చేర్చుకోవాలి.  పండిన అరటిపండ్లు, తొక్కతీసిన యాపిల్, ప్రూన్స్, పీచ్  పండ్లను డైట్లో చేర్చుకుంటే దీర్ఘకాలిక మలబద్ధకం సమస్యలకు చెక్ పెట్టొచ్చు. వీటిని ఆహారం తినే ముందు లేదా ఆ తర్వాత తీసుకోవాలి.

ఇదీ చదవండి: పుచ్చకాయను సగం కట్ చేసి ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఈ ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త..

మసాలాలు..
దీర్ఘకాలిక మలబద్ధకం సమస్య నుంచి బయటపడటానికి మన ఇంటి కిచెన్లో ఉండే మసాలాలు కూడా సహాయం చేస్తాయి. ఇంగువ, వెల్లుల్లి, సాధారణ ఉప్పు కూడా మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని మెరుగుచేస్తాయి. సాధారణ ఉప్పు వాత దోషానికి చెక్ పెడతాయి. నీటిని కూడా ఎక్కువ శాతం తీసుకుంటే మలబద్ధకం సమస్య పోతుంది.

మూలికలు..
త్రిఫల, అమలకి, హరితకి, విభితకి కూడా దీర్ఘకాలిక మలబద్ధకం సమస్య నుంచి కాపాడతాయి. వీటిని తీసుకుంటే వాత, పిత, కఫ దోషాలను సమతుల్యం చేస్తాయి.  స్వర్ణపత్రి కూడా మలబద్ధకం సమస్యలకు చెక్ పెడతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News