Heart Attack Symptoms: చాలామందికి ఇటీవల కామన్‌గా కన్పిస్తున్న సమస్య బ్యాక్ పెయిన్. వీపు భాగంలో నొప్పి రావడం. ఇది ఎంత సాధారణమైందో ఒక్కోసారి అంతే గంభీరం కావచ్చు. అందుకే బ్యాక్ పెయిన్‌ను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదంటారు వైద్యులు. ఇది హార్ట్ ఎటాక్‌కు ముందస్తు సంకేతం కావచ్చు. అందుకే బ్యాక్ పెయిన్ విషయంలో అప్రమత్తత అవసరం.
శరీరంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఎదురౌతూనే ఉంటుంది. దీనికి కారణం మారుతున్న లైఫ్‌స్టైల్, చెడు ఆహారపు అలవాట్లు. ముఖ్యంగా గుండె వ్యాధులు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గత కొద్దికాలంగా హార్ట్ ఎటాక్ కేసులు పెరుగుతున్నాయి. ఒకప్పుడు హార్ట్ ఎటాక్ అంటే వయసు రీత్యా పెద్దవాళ్లకు వచ్చేది. కానీ ఆధునిక జీవనశైలి కారణంగా యుక్త వయస్సులోనే గుండెపోటు సంభవిస్తోంది. దీనికి చాలా కారణాలున్నాయి. హై కొలెస్ట్రాల్, డయాబెటిస్, స్థూలకాయం, అధిక రక్తపోటు వంటివి. ఈ సమస్యలుంటే గుండె పోటు రావడం సహజమే. అందుకే ఛాతీలో నొప్పి అనగానే చాలామంది గుండె నొప్పేమో అని కంగారు పడుతుంటారు. గుండె పోటు వచ్చేముందు శరీరంలో చాలా సంకేతాలు వెలువడుతుంటాయి. ఛాతీ నొప్పి కూడా గుండె నొప్పికి కారణమైనా ఇతర అవయవాల్లో కూడా నొప్పి కన్పిస్తుంది.
భుజాలు, జబ్బలు, మెడ భాగంలో నొప్పి వ్యాపిస్తుంది. ఎడమ చేతి వరకూ ఈ నొప్పి వ్యాపించవచ్చు. మహిళల్లో ఎక్కవగా ఉంటుంది. ఈ లక్షణాల్ని ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు. ఎడమ చేయి తరచూ నొప్పిగా ఉంటే వెంటనే అప్రమత్తం కావాలి. వైద్యుని సంప్రదించాలి. ఎందుకంటే ఇది కచ్చితంగా గుండె నొప్పికి లక్షణం కావచ్చు. స్పాండిలైటిస్ స్థితిలో కూడా ఎడమ చేయి లేదా కుడి చేయిన నొప్పి ఉంటుంది. గుండె లేదా ఛాతీ భాగంలో బరువుగా ఉంటుంది.
ఇక గుండె నొప్పి వచ్చే ముందు వీపు పైభాగంలో నొప్పి ఉండవచ్చు. ఈ నొప్పి సాధారణంగా భుజాల మధ్య వెనుకవైపు ఉంటుంది. మహిళల్లో ఎక్కువగా ఈ సమస్య ఉంటుంది. కండరాల్లో క్రాంప్స్ లేదా అలసట అనుకోవచ్చు. కడుపు నొప్పి కూడా ఓ లక్షణం. సాధారణంగా కడుపు నొప్పి వస్తే అజీర్తి అనుకుని వదిలేస్తుంటాం. కానీ గుండె పోటు వచ్చే ముందు కడుపులో నొప్పి కూడా ఓ లక్షణం. అందుకే ఈ లక్షణాలను తేలిగ్గా తీసుకోకూడదు.
Also read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ దీక్షల వెనుక పెద్ద వ్యూహమే ఉందా, తెరవెనుక ఏం జరుగుతోంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.