High Cholesterol: ఈ చిన్న వ్యాధులే రేపటి గుండె పోటుకు దారి తీస్తున్నాయి..!

Bad Cholesterol Warning Sign In Legs: ప్రస్తుతం చాలామందిలో చెడు కొలెస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా వైద్య నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. లేకపోతే గుండెపోటు, మధుమేహం వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2022, 10:26 AM IST
High Cholesterol: ఈ చిన్న వ్యాధులే రేపటి గుండె పోటుకు దారి తీస్తున్నాయి..!

Bad Cholesterol Warning Sign In Legs: మారుతున్న జీవనశైలి చెడు అలవాట్ల కారణంగా చాలామందిలో కొలెస్ట్రాల్ విచ్చలవిడిగా పెరిగిపోతోంది. అయితే కొలెస్ట్రాల్ పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. కానీ చాలామంది ఎలాంటి జాగ్రత్తలు పాటించడం లేదు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తీవ్రంగా పేరుకుపోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ పెరిగితే శరీరంపై పలు లక్షణాలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. శరీరంలో కొవ్వు పెరగడం వల్ల ఈ కింది లక్షణాలు తరచుగా ఏర్పడతాయి. 

కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ మంచిదా చెడు దాని వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది. లేకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఈ క్రింది లక్షణాలు తరచుగా ఏర్పడితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినట్లే:

చల్లటి పాదాలు:
చాలామందిలో చలికాలంలో పాదాలు చల్లగా మారుతూ ఉంటాయి. ఇది సర్వసాధారణమైనప్పటికీ వేసవికాలంలో కూడా ఇలా మారితే శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరిగినట్లు లేనని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.

పాదాల్లో నొప్పి:
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అతిగా పెరగడం వల్ల రక్తనాళాల్లో తీవ్ర సమస్యలు ఏర్పడి.. రక్త ప్రసరణ వేగం తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీంతో కాళ్ల నొప్పి వాదాల్లో నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తరచుగా ఇలాంటి నొప్పులతో బాధపడేవారు వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

గోరు రంగు:
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల పాదాల గోళ్ల రంగు మారే అవకాశాలున్నాయి. లైట్ పింక్ కలర్ లో ఉండే గోళ్ల రంగు పసుపు రంగులోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీలో ఇలాంటి సమస్యలుంటే తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. 

ఆకస్మిక కుదుపు:
నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా కాళ్ళలో తిమ్మిరి లేదా మెలితిప్పినట్లు ఉంటే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినట్లేనని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి కండరాల సమస్యలు ఏర్పడడం వల్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read : Ram Charan Video Call : గుడ్ న్యూస్ చెప్పబోతోన్న ప్రభాస్!.. లీక్ చేసిన రామ్ చరణ్‌

Also Read : Anasuya Bharadwaj White Dress : బొడ్డు చూపిస్తున్న జబర్దస్త్ బ్యూటీ.. తెలుపు దుస్తుల్లో అనసూయ అందాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News