Bad Habits: మెదడుపై తీవ్ర ఒత్తిడి.. ఈ ఐదు చెడు అలవాట్లను మానేయండి..!

What Habits Cause Brain Damage: మెదడుపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించాలంటే కచ్చితంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. నిద్రలేమి, ధూమపానం, మద్యపానం, ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వంటి అలవాట్లు మెదడుపై ప్రభావం చూపిస్తాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2023, 07:34 PM IST
Bad Habits: మెదడుపై తీవ్ర ఒత్తిడి.. ఈ ఐదు చెడు అలవాట్లను మానేయండి..!

What Habits Cause Brain Damage: మనం ఏ పని చేయాలన్నా మెదడు కమాండ్ చేస్తుంది. మనల్ని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచడంలో మెదడుదే ప్రధాన పాత్ర. మెదడు సరిగా పనిచేయకపోతే పిచ్చోళ్లు అయిపోతారు. శరీరంలో ఎంతో కీలకమైన మెదడును జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. వయసు పెరుగుతున్న కొద్దీ మెదడు పనితీరు మందగిస్తుంది. అలాంటి మెదడును మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. చెడు అలవాట్లతో మెదడను బలహీనపరుస్తాయి. ఆ చెడు అలవాట్ల నుంచి మీకు ఉంటే సాధ్యమైనంత త్వరగా బయటపడండి. 

తక్కువ నిద్ర  

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలామందికి కంటినిండా నిద్ర సరిగా ఉండడం లేదు. మంచి నిద్ర మన శరీరానికి చాలా అవసరం. నిద్రలేమి కారణంగా మనస్సుపై ఒత్తిడి పెరుగుతుంది. కంటినిండా నిద్రపోతే మెదడుపై ఒత్తిడి తగ్గుతుంది.

ఆహారం విషయంలో..

ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్‌స్టంట్‌గా తినే ఆహారం నాలుకకు మంచి రుచిని అందించినా.. శరీరానికి హాని కలుగుతుంది. మీ తినే ఆహారంలో ఎక్కువ కారం లేకుండా చూసుకోండి. చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవద్దు. 

సిగరెట్లు, ఆల్కహాల్

సిగరెట్లు, ఆల్కహాల్ వంటి చెడు అలవాట్లు మెదడుపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. నిత్యం ధూమపానం లేదా ఆల్కహాల్ సేవించే వారి మెదడులో సమస్యలు ఏర్పడతాయి. వారి జ్ఞాపకశక్తి  కూడా బలహీనపడుతుంది. వీలైనంత త్వరగా ఈ అలవాట్లకు దూరంగా ఉండండి.

ఎక్కువ సేపు కూర్చోవడం

ఆఫీస్‌లలో కూర్చొని ఉద్యోగాలు చేసేవారు ఎక్కువ సమయం ఒకేచోట కదలకుండా ఉంటారు. ఇది శరీరానికి హాని కలిగిస్తుంది. ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల శరీరంలో రక్తపోటు తగ్గి మెదడు దెబ్బతింటుంది. అధిక బరువు కూడా పెరుగుతారు.

ఫోన్‌ను అధికంగా ఉపయోగించడం

ఫోన్‌ను అధికంగా ఉపయోగించడం కూడా ఒత్తిడికి కారణమవుతుంది. ఫోన్ స్క్రీన్‌ను ఎక్కువ చూడడం మెదడుపై ప్రభావం చూపిస్తుంది. మెదడు పనితీరులో అసమతుల్యత, నిద్రలేమి, మనస్సు అస్థిరత వంటి అనేక సమస్యలు వస్తాయి.

(గమనిక: ఇక్కడ అందజేసిన ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా స్వీకరించే ముందు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.)

Also Read: BRS-BJP Alliance: హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్-బీజేపీ పొత్తు ఉంటుందా, అమిత్ షా ఏమంటున్నారు

Also Read: AB De Villiers Team: ఏబీ డివిలియర్స్ దృష్టిలో బెస్ట్ ప్రపంచకప్ టీమ్ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News