Bael Juice Benefits: వేసవిలో ఓ దివ్యౌషధంతో సమానం ఈ జ్యూస్, లాభాలు అన్నీ ఇన్నీ కావు

Bael Juice Benefits: వేసవిలో సాధ్యమైనంతవరకూ శరీరానికి చలవ చేసే పదార్ధాలు తీసుకోవల్సి ఉంటుంది. ఎందుకంటే బాహ్యంగానే కాకుండా అంతర్గతంగా శరీర ఉష్ణోగ్రత పెరిగిపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. వేసవిలో చల్లదనంతో పాటు ఒంటికి చలవ కూడా అవసరం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 15, 2023, 09:31 AM IST
Bael Juice Benefits: వేసవిలో ఓ దివ్యౌషధంతో సమానం ఈ జ్యూస్, లాభాలు అన్నీ ఇన్నీ కావు

Bael Juice Benefits: వేసవిలో బయటి ఉష్ణోగ్రత, అంతర్గత వేడి నుంచి రక్షించుకునేందుకు చాలా పద్ధతులున్నాయి. ఎన్నోరకాల చిట్కాలున్నాయి. ముఖ్యంగా ఒంటికి చలవ చేసేందుకు చాలా మార్గాలున్నాయి. ప్రకృతిలో లభించే సహజసిద్ధమైన పదార్ధాలతో చాలా ప్రయోజనాలున్నాయి.

ప్రస్తుతం మార్కెట్ లో బేల్ ఫ్రూట్స్ విరివిగా లభిస్తున్నాయి. బేల్ ఫ్రూట్‌ని సాధారణంగా సమ్మర్ ఫ్రూట్‌గా పిలుస్తారు. ఈ ఫ్రూట్ స్వభావరీత్యా చలవ చేస్తుంది. అందుకే శరీరానికి చాలా ప్రయోజనకరం. కేవలం ఆరోగ్య ప్రయోజనాలో కాకుండా రుచి కూడా అద్బుతంగా ఉంటుంది. అందుకే వేసవిలో బేల్ ఫ్రూట్స్ జ్యూస్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఇది శరీరానికి ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉంచుతుంది. బేల్ ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలు పరిశీలిద్దాం..

1. అధిక రక్తపోటు నియంత్రణ

అధిక రక్తపోటు రోగులకు బేల్ ఫ్రూట్ జ్యూస్ చాలా మంచిదని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో కొలెస్ట్రాల్ నియంత్రించే గుణాలు అత్యధికంగా ఉంటాయి. దాంతో రక్త సరఫరాకు ఏ విధమైన ఇబ్బంది కలగదు. మరోవైపు శరీరంలో నీటి కొరతను తీరుస్తుంది.

2. బరువు తగ్గించడం

బేల్ ఫ్రూట్ తాగడం వల్ల శరీరం బరువు తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో పెద్దమొత్తంలో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడటం, శరీరం మెటబోలిజం వేగవంతం కావడంతో బరువు సహజంగా తగ్గుతుంది. ఈ జ్యాూస్ తాగడం వల్ల చాలా వరకూ రిలీఫ్ లభిస్తుంది. క్రేవిటీ కూడా తగ్గుతుంది. మలబద్ధకం, కడుపులో బరువుగా ఉండటం వంటి సమస్యలుంటే..ఈ జ్యూస్ తాగడం వల్ల దూరమౌతాయి. అందుకే వేసవిలో బేల్ ఫ్రూట్ జ్యూస్ తప్పనిసరి. 

3. డయాబెటిస్ నియంత్రణ

బేల్ ఫ్రూట్ జ్యూస్‌తో కలిగే మరో అద్భుతమైన ప్రయోజనం డయాబెటిస్ నియంత్రణ. బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది. ఎందుకంటే ఈ ఫ్రూట్ జ్యూస్‌లో పంచదార ఉండదు. అందుకే బ్లడ్ షుగర్ నియంత్రణకు చాలా మంచిది.

4. ఇమ్యూనిటీ పటిష్టం

బేల్ ఫ్రూట్ జ్యూస్‌లో పోషకాలు పెద్దమొత్తంలో ఉంటాయి. ఇవి శరీరానికి చలవ అందిస్తాయి. ఇమ్యూనిటీని పటిష్టం చేసేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ బేల్ ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తం పరిశుభ్రమౌతుంది.

Also read: Fennel Seeds: వేసవిలో సోంపు క్రమం తప్పకుండా తింటే కలిగే అద్భుత లాభాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News