Record Heat Wave In Delhi: దేశ రాజధానిలో భానుడి ప్రతాపం..రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..!!

Record Heat Wave In Delhi: ఢిల్లీలో ఎండల తీవ్రత పెరిగింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఏప్రిల్‌ నెలలోనే 43.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్టు వాతావరణశాఖ తెలిపింది. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలకు మే ఒకటో తేదీ వరకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2022, 10:28 AM IST
  • ఢిల్లీలో ఎండల తీవ్రత అధికం
  • మే 1 వరకు ఎల్లో అలర్ట్‌ జారీ
  • రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదు
Record Heat Wave In Delhi: దేశ రాజధానిలో భానుడి ప్రతాపం..రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..!!

Record Heat Wave In Delhi: ఢిల్లీలో ఎండల తీవ్రత పెరిగింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఏప్రిల్‌ నెలలోనే 43.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్టు వాతావరణశాఖ తెలిపింది. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలకు మే ఒకటో తేదీ వరకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

దేశవ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో అయితే పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. ఏప్రిల్‌ నెలలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సాధారణంగా ఏప్రిల్‌ నెలలో ఢిల్లీలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. అయితే ఈ సారి ఢిల్లీలో ఏప్రిల్‌ నెలలోనే రికార్డు స్థాయిలో ఎండలు దంచికొట్టడం 72 సంవత్సరాల్లో ఇది రెండోసారి.  ఎండల తీవ్రత మే రెండో తేదీ వరకు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

72 సంవత్సరాల్లో తొలుత 2010 ఏప్రిల్‌ నెలలో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 40.40 డిగ్రీల సెల్సియస్‌ వరకు రికార్డు అయ్యాయి. అయితే ఈ సంవత్సరం సాధారణ నెలవారి ఉష్ణోగ్రతలు 40.20 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదు అవుతాయని ఐఎండీ తెలిపింది. ఎండల తీవ్రతతో వడగాల్పులు కూడా అధికంగానే వీస్తున్నాయి.  మరో రెండు రోజుల పాటు దాని ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించింది.

వాతావరణశాఖ ఇప్పటికే ఢిల్లీకి ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. మే ఓకటో తేదీ వరకు ఢిల్లీతో సహా రాజస్థాన్‌ లోని పలు ప్రాంతాలు, పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు ఈ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఏదిఏమైనప్పటికీ.. మే 2వ తేదీ తర్వాత కాస్త వర్షాలు వచ్చే అవకాశం ఉందని ప్రకటించింది. కేవలం ఒక్క ఢిల్లీయే కాకుండా వెస్ట్రన్‌ రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానా, వెస్ట్రన్‌ ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌తో పాటు జార్ఖండ్‌ రాష్ట్రాల్లోనూ ఎండల తీవ్రత అధికంగా ఉంది. గురువారం రోజు ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఏప్రిల్‌ నెలలో 43.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్టు వాతావరణశాఖ తెలిపింది.

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు కాస్త జాగ్రత్తలు పాటించాలని ఢిల్లీ సర్కార్‌ సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది. మొత్తంగా దేశరాజధాని ఢిల్లీలో మాత్రం ఎండలు దంచికొడుతున్నాయి.

Also Read: CPI Narayana: కేటీఆర్‌ కు మద్దతు తెలిపిన సీపీఐ నారాయణ..!!

Also Read: Minister Venu Gopalakrishna: వేదికపై వైవీ సుబ్బారెడ్డి ముందు మోకరిల్లిన మంత్రి వేణు గోపాలకృష్ణ...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News