Vitamin C foods: రోగ నిరోధక శక్తిని పెంచే పండ్లు, కూరగాయలు

Immunity Boosting Foods: వర్షా కాలంలో వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు ప్రభలే ఈ సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే.. అనారోగ్యం బారినపడే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది. అదే కానీ జరిగితే ఆ తర్వాత సీజనల్ వ్యాధులు సైతం ఈజీగా ఎటాక్ చేస్తాయి. అంతకంటే ముందుగానే మీరు మేల్కొంటే.. అనారోగ్యం బారిన పడకుండా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 1, 2023, 08:53 AM IST
Vitamin C foods: రోగ నిరోధక శక్తిని పెంచే పండ్లు, కూరగాయలు

Immunity Boosting Foods: వర్షా కాలంలో వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు ప్రభలే ఈ సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే.. అనారోగ్యం బారినపడే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది. అదే కానీ జరిగితే ఆ తర్వాత సీజనల్ వ్యాధులు సైతం ఈజీగా ఎటాక్ చేస్తాయి. అంతకంటే ముందుగానే మీరు మేల్కొంటే.. అనారోగ్యం బారిన పడకుండా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. మొదటిగా మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయో చూసుకోవాల్సి ఉంటుంది. 

నిత్యం మీరు తీసుకునే ఆహారంలో విటమిన్-సి కలిగిన ఫుడ్స్ ఉంటున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ సి విటమిన్ ఫుడ్స్ లేనట్టయితే.. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయి తరచుగా జలుబు, జ్వరం, అలసట, ఇతర ఇన్‌ఫెక్షన్స్ బారినపడుతుంటారు. ఏ చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనా.. దాని ప్రభావం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది. 

రోగ నిరోధక శక్తి లేనివారిలో కరోనా ప్రభావం కూడా మరీ ఎక్కువగా ఉంటుందంటున్నారు పోషక ఆహార నిపుణులు. ఈ కష్టాలన్నింటి నుంచి గట్టెక్కాలంటే.. విటమిన్ సి ఫుడ్ తప్పనిసరి అని ఇంకా వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇంతకీ ఏయే ఫుడ్స్‌లో విటమిన్ సి ఉంటుందో తెలుసుకోవాలంటే.. ఇదిగో ఈ డీటేల్స్ చూడాల్సిందే.  

విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో టమాట, బంగాళదుంప లాంటి కూరగాయలు ముందు వరుసలో ఉంటాయి. నారింజ, నిమ్మ, కమలా పండు, కివీ పండ్లలోనూ విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. వీటిని నిత్యం తీసుకునే ఆహారంలో ఓ భాగంగా చేసుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకునే హెల్తీ ఫుడ్ ఒంటికి నేరుగా చేరేలా చేస్తుందంటున్నారు న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్స్ 

ప్రతీ రోజూ ఒక కప్పు తాజా పెరుగు తీసుకుంటే అది జీర్ణాశయంలో వ్యాధులకు కారణమయ్యే బాక్టీరియాను నివారిస్తుంది. ప్రతీరోజు అరకప్పు తాజా క్యారెట్‌ను తీసుకుంటే.. అందులో ఉండే బీటా కెరోటిన్‌, విటమిన్‌ బి6లు శరీరానికి మేలు చేస్తాయి.

ప్రతీ రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నాలుగు లేదా ఐదు ఖర్జూరాలను తింటే.. శరీరంలో ఐరన్‌ మోతాదు పెరుగుతుంది. 

ప్రతీ రోజు ఒక యాపిల్ పండు తింటే డాక్టర్‌ని సంప్రదించాల్సిన అవసరమే రాకపోవచ్చు అనేది వైద్య నిపుణుల సలహా. ఎందుకంటే యాపిల్ పండ్లలో అధిక రక్తపోటుని నియంత్రించి ఉత్తేజాన్ని పెంచే గుణం ఉంటుంది. యాపిల్‌ పండ్లలో అధిక మోతాదులో ఉండే విటమిన్‌ సి, పొటాషియం శరీరానికి అధిక శక్తిని ఇస్తాయి.

Trending News