బరువు తగ్గడానికి.. బ్లాక్ టీ

Last Updated : Oct 5, 2017, 05:05 PM IST
బరువు తగ్గడానికి.. బ్లాక్ టీ

బరువు తగ్గడానికి ఏవో చేస్తుంటాము. డాక్టర్ సలహాలనూ పాటిస్తుంటాము. రోజువారీ తీసుకొనే కొవ్వు పదార్థాల మోతాదునూ బరువు తగ్గాలనే కారణంగా తీసుకోవడం మానేస్తాము. కానీ,  ఒక్క 'టీ' తో మీరు బరువు తగ్గే చిట్కా ఒకటుంది. అదే .. 'బ్లాక్ టీ'. దీని వల్ల కేవలం బరువు ఒక్కటే కాదు..  చాలా వరకు సమస్యలను నివారించవచ్చు. అవేంటో చూద్దాం..!

1. రక్తపోటుతో బాధపడుతున్నవారు రోజుకు మూడు కప్పుల బ్లాక్ టీ తాగడంవల్ల రక్తపోటు తగ్గుతుందని శాస్త్రవేత్తలు  అంటున్నారు. ఇలా మూడు కప్పులు తాగేవారికి రక్తపోటు తగ్గిందని యూనివర్సిటీ అఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా పరిశోధకులు కనుగొన్నారు. 

2. బ్లాక్ టీ లో  ఫ్లవనాయిడ్స్ రక్తనాళాలు స్థితి మెరుగుపరిచి బరువు, కొవ్వు తగ్గడంతో చురుగ్గా పాల్గొంటాయి. ఒత్తిడి, బరువు, అధిక పొట్ట సమస్యలతో బాధపడుతున్నవారికి డాక్టర్లు కూడా బ్లాక్ టీ తాగండని ప్రోత్సహిస్తున్నారు. 

3. బ్లాక్ టీ లో కాసింత పాలు కలుపుకొని తాగితే గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చని యూకేలోని టీ అడ్వైజరి ప్యానెల్ తెలిపింది. 

4. దంత సమస్యల నుండి విముక్తి  పొందాలంటే రోజూ ఉదయాన్నే బ్లాక్ టీ తీసుకోవాలి. 

5.  బ్లాక్ టీ  క్యాన్సర్, పార్కిన్సన్ వ్యాధి ( పొగతాగేవారిలో వస్తుంది) రాకుండా అడ్డుకుంటాయి. 

6. డయేరియా వ్యాధిగ్రస్తులకు బ్లాక్ టీ 'టానిక్' లాగా ఉపయోగపడుతుంది.

7. బ్లాక్ టీ తాగటం వెంట్రుకలకు మంచిది. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. 

8. బ్లాక్ టీ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా  లభిస్తాయి. రెండు యాపిల్స్ లో, ఐదు రకాల కాయగూరల్లో లభించేత యాంటీఆక్సిడెంట్లు రెండు కప్పుల బ్లాక్ టీ లోదొరుకుతుంది. 

9. బ్లాక్ టీ తాగితే పేగులోని బాక్టీరియాను వృద్ధి చెందుతుంది. తద్వారా జీవక్రియ రేటు పెరిగి బరువు తగ్గటానికి దోహదపడుతుంది అని లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ సంయుక్త పరిశోధనల్లో తెలిసింది. 

10. బ్లాక్ టీ తాగితే ఫ్లూ, జ్వరం, దగ్గు, అలర్జీ, డీ హైడ్రేషన్ వంటివి దరిచేరవు. ఎముకలు బలంగా ఉంటాయి. 

Trending News