Cholesterol reduced Foods: కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను పదిలంగా ఉంచే అలవాట్లు

శరీరం రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతే గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంది. కావున ఇక్కడ తెలిపిన వాటిని తింటూ వ్యాయామాలు చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 25, 2021, 03:46 PM IST
  • ఒక ఆరోగ్యకరమైన ఆహరంతో పాటు వ్యాయామం చేయడం తప్పనిసరి.
  • పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహరం తీసుకోవాలి.
  • ప్రతిరోజూ వ్యాయామం చేయాలి & ఒమేగా-3 ఫ్యాటి ఆసిడ్ గల ఆహరం తినాలి.
  • వైద్య పరమైన శ్రద్ధ ఖచ్చితంగా ఉంటూ, మందులు వాడాలి.
Cholesterol reduced Foods: కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను పదిలంగా ఉంచే అలవాట్లు

Cholesterol reduced Foods: కొలెస్ట్రాల్ అనే పదార్థం రక్తం సరఫరా అయ్యే ధమనులలో పేరుకుపోయి, వయసుతో పాటు వాటి స్థాయి కూడా పెరిగిపోయి గుండె సంబందిత ప్రమాదాలకి దారితీస్తాయి. కార్డియాలజిస్ట్ ల ప్రకారం వయసు 20 దాటిన ప్రతీ ఒక్కరిలో కొలెస్ట్రాల్ పెరిగిపోయే ప్రమాదం ఉంది.

కావున మీరు కచ్చితంగా శరీరంలోని కొలెస్ట్రాల్ ని తగ్గించే ఆహార పదార్థాల గురించి తెలుసుకోవాలి. అలాంటి ఆహారమే తీసుకోవడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఆహారంతో పాటు తగిన వ్యాయామం చేయడం మాత్రం మరవకూడదు. ఇలా చేయడం వలన నెమ్మదిగా మీ రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి, గుండె సంబందిత వ్యాదులకు దూరంగా ఉంటారు. మీ యొక్క జీవన శైలితో పాటు ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వలన ఆరోగ్యవంతంగా ఉంటారు.

Also Read: Venu Swami Comments on Rakul: వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు.. రకుల్ ఎంగేజ్మెంట్ ఆగిపోనుందట..!!

పీచు ఆహరం...
పీచు పదార్ధం కలిగిన ఆహారం అంటే ఫైబర్ ఎక్కువగా గల ఆహార పదార్థాలు...  వీటిని తీసుకోవడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిపోతుంది. బీన్స్, చిక్కుడుకాయ వంటి కురగాయాలలో ఎక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ పదార్థం కొలెస్ట్రాల్ తో బంధనం ఏర్పరచుకుని, దాని యొక్క స్థాయి 5 శాతం వరకు తగ్గిస్తుంది. ఫైబర్ లో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. కోరిందకాయలు, బేరి (పియర్స్) పండ్లను పొట్టుతో పాటు తినాలి. ఆపిల్ కూడా తొక్క తీయకుండా తినాలి. పండ్లు మరియు కురగాయాలలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది.

ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్...
ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి సహాయపడతాయి. ఈ ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా సాల్మన్, మకెరేల్ మరియు హెర్రింగ్ అనే చేపలలో ఎక్కువగా ఉంటాయి. అక్రోటుకాయ (వాల్నట్స్), బాదం మరియు అవిస గింజలలో ఎక్కువగా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి.

Also Read: National Film Awards 2021: ఒకే రోజు, ఒకేస్టేజీపై మామ అల్లుళ్లకు అవార్డులు..ఆనందంలో సూపర్ స్టార్ ఫాన్స్

వ్యాయామం...
మంచి  కొలెస్ట్రాల్ ని పెంచి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి వ్యాయామం చాలా ఉత్తమమైన పద్ధతి. ఎవరైతే తరుచుగా వ్యాయామం చేస్తారో వారిలో అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ యొక్క శాతం  పెరుగుతుంది. ఇలాంటి లిపోప్రొటీన్ లు రక్తంలో కలిసిన చెడు కొలెస్ట్రాల్ ని తొలగిస్తుంది. మీరు చేసే ప్రతీ ఒక్క వ్యాయామం 10 నుంచి 20 నిమిషాలు కచ్చితంగా ఉండాలి. అది నడవడం కావచ్చు, నీటిలో ఈదడం కావచ్చు, జాగింగ్ కావచ్చు, ఏ ఇతర వ్యాయామం అయిన కావచ్చు. ఏరోబిక్ వ్యాయామాలు చేసేవారు కచ్చితంగా 30 నిమిషాల పాటు, వారానికి కనీసం ఐదు రోజులైనా చేయడం తప్పనిసరి

మందులు, మాత్రలు...
తగిన మందులు లేక మాత్రలు వాడటం వలన రక్తంలోని  కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చు. కాని ఈ మందులు వైద్యుడి సలహా మేరకి మాత్రమే వేసుకోవాలి. నియాసిన్ మరియు మొక్కల స్టిరాల్స్ వంటి మందులు వాడాలి. నియాసిన్ తీసుకోవడం కొంచెం ప్రమాదంతో కూడుకున్నది. నియాసిన్ వలన రక్తంలో చెక్కర శాతం పెరిగి, ఎర్రబారడం జరుగుతుంది. కాని రోజు తగిన మోతాదులో తీసుకోవడం వలన హెచ్ HDL యొక్క స్థాయి 15 నుంచి 35 శాతం పెంచి LDL స్థాయిని 20 శాతం వరకు తగ్గిస్తుంది. కాని నియాసిన్ వలన చాలా దుష్ప్రభావాలు కలుగుతాయి. కావున నియాసిన్ తీసుకునేవారు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ప్రతిరోజూ ప్లాంట్ స్టిరాల్స్ 2 గ్రాముల మోతాదులో నారింజ రసంతో కాని, వనస్పతితో కాని తీసుకోవడం వలన రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని 15 శాతం వరకు తగ్గించవచ్చు.

Also Read: India Vs Pakistan: గెలుపు తరువాత భావోద్వేగాయానికి గురైన బాబర్ అజామ్ తండ్రి.. వీడియో వైరల్

రైస్ ఈస్ట్ తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చు, కాని అందులో లోవాస్టాటిన్ ఉండడం వలన ప్రమాదకరమైన దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉంది.

కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం పెద్ద కష్టమైన పని ఏ మాత్రము కాదు. మీరు చేయవలిసింది కేవలం ఆరోగ్యమైన ఆహరం తీసుకోవడం, చెడు అలవాట్లకి దూరంగా ఉండడం మరియు అధిక కొవ్వు ఉండే పదార్థాలని తినకుండా ఉండడం మాత్రమే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News