Cholesterol Control Blue Tea: ఆధునిక జీవనశైలిని అనుసరించడం వల్ల యువత కూడా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాకుండా కొందరు గుండెపోటుకు గురవుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జీవనశైలిలో మార్పులే కాకుండా.. తీసుకునే ఆహారంలో కూడా చిన్నచిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం చాలామందిలో అనారోగ్యకరమైన ఆహారాలను తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.
ఇప్పటికే కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా డైట్ లో భాగంగా ఈ ఆయుర్వేద గుణాలు కలిగిన టీ ని ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది. శంకు పూలతో తయారు చేసిన టీలో చాలా రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి కాబట్టి ప్రతిరోజు ఈ టీ ని తాగడం వల్ల శరీరానికి పోషకాలు అందడమే కాకుండా..రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు శరీరాన్ని తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా కాపాడుతాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా శంకు పూలతో తయారుచేసిన టీ ని ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది.
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
శంకు పూల టీ తయారీ విధానం:
ఈ టీ ని తయారు చేయడానికి ముందుగా శంకు పువ్వులను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఎండలో ఉంచి గుడిలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సిలిండర్ పై ఓ బౌల్ పెట్టుకొని అందులో రెండు గ్లాసుల నీటిని పోసుకొని బాగా మరిగించాలి. ఇలా మరిగించిన తర్వాత శంకు పువ్వుల పొడిని అందులో వేసి ఐదు నిమిషాల పాటు మరిగించి గ్లాసులోకి తీసుకొని వడకట్టుకోవాలి. వాడకట్టుకున్న తర్వాత రుచికి సరిపడా తేనెను వేసి బాగా మిక్స్ చేసుకొని తాగొచ్చు.
ఈ టీని ప్రతిరోజు తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ సమస్యలు కూడా దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పరిమాణాలు అధికంగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ టీ ప్రభావంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ టీని ప్రతిరోజు తాగడం వల్ల సీజనల్ వ్యాధులు కూడా దూరమవుతాయి.
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook