Cholesterol Control Tips: పుచ్చకాయతో సమ్మర్‌లో ఇలా సులభంగా బరువు తగ్గొచ్చు!

Watermelon For Control Cholesterol And Blood Pressure: పుచ్చకాయలో ఉండే గుణాలు శరీరానికి కావాల్సిన చాలా రకాల గుణాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్ ఎ, పొటాషియం, విటమిన్ బి1 శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. అంతేకాకుండా శరీర బరువును కూడా నియంత్రిస్తుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2023, 04:33 PM IST
Cholesterol Control Tips: పుచ్చకాయతో సమ్మర్‌లో ఇలా సులభంగా బరువు తగ్గొచ్చు!

Watermelon For Control Cholesterol And Blood Pressure: శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి చాలా మంది ప్రతి రోజూ వ్యాయామాలతో పాటు, జిమ్‌ కూడా చేస్తున్నారు. అయినప్పటికీ చాలా మందిలో శరీరం ఫిట్‌గా మారలేకపోతోంది. దీనికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలు విచ్చల విడిగా తినడమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శరీరం ఫిట్‌గా ఉంచుకోవడానికి తప్పకుండా డ్రై ఫ్రూట్స్‌ ఇతర అరోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా జీవన శైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని పాటించడం వల్లే  వేసవి కాలంలో మిమ్మల్ని ఫిట్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంచుకోగలుగుతారు.

ఎనర్జీని పెంచే పండ్లను డైట్‌లో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వేసవి కాలంలో అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షించుకోవడానికి పుచ్చకాయ ప్రభావవతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ప్రతి రోజూ వేసవి కలంలో తప్పకుండా పుచ్చకాయలను తీసుకోవాల్సి ఉంటుంది.

పుచ్చకాయలో లభించే పోషకాలు:
పుచ్చకాయలో అనేక పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, విటమిన్ బి1, విటమిన్ బి5, విటమిన్ బి6 పుష్కలంగా ఉన్నాయి.మన శరీరానికి రోజూ అవసరమైన ఫైబర్, మెగ్నీషియం వంటి పోషకాలు అందించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఎండా కాలంలో వీటిని ప్రతి రోజూ తీసుకోవడం శరీరానికి ఈ కింది ప్రయోజనాలు కలుగుతాయి.

పుచ్చకాయ తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు:
పుచ్చకాయ తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది.
పుచ్చకాయలో లైకోపీన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.
ఇందులో ఉండే విత్తనాలతో తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ కళ్లకు మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
పుచ్చకాయలో కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది.. కాబట్టి ఇది మనసును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతంది.
అంతేకాకుండా ఇందులో ఉండే పోషకాలు ఎముకలు, కండరాలు దృఢంగా చేసేందుకు దోహదపడతాయి.
పుచ్చకాయ తినడం వల్ల చర్మం సమస్యలకు దూరమవుతాయి.

ఇది కూడా చదవండి : Revanth Reddy: పొద్దునలేస్తే రాత్రి వరకు కేటీఆర్ సినిమా వాళ్లతోనే.. సమంత సోకులు మాకొద్దు: రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

ఇది కూడా చదవండి : Jaggareddy Interesting Comments: సీఎం కేసీఆర్‌ని కలిస్తే తప్పేంటన్న జగ్గారెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News