Cholesterol Symptoms: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ సమస్యలు చిన్న,పెద్ద తేడా లేకుండా అందరిలో పెరగడం విశేషం. శరీరంతో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా అధికం. కావున ఆరోగ్య నిపుణులు పలు రకాల చిట్కాలను సూచిస్తున్నారు. వీటి ద్వారా చెడు కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. అయితే శరీరంలో చెడు కొవ్వు పరిమాణం ఎక్కువైతే పలు రకాల శరీరక మార్పులు ఉత్పన్నమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడానికి శరీరంలో వచ్చే మార్పులు సంకేతాలుగా కూడా నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో ఇటువంటి మార్పులు కనిపిస్తాయి:
పాదాలు చల్లగా మారడం:
చలికాలంలో పాదాలు చల్లగా మారితే మామూలే కానీ.. వేసవిలో కూడా ఇలా చల్లగా మారితే నిర్లక్ష్యం చేయకండి. ఇలా పాదాలు మారితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఖచ్చితంగా పెరిగాయని సూచనలని నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమస్య మీలో వస్తే తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది.
చర్మం-గోళ్ల రంగు మారడం:
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే మీ చర్మం, గోళ్లపై ప్రభావం కనిపిస్తుంది. వాటి రంగు మారడం వివిధ రకాల మార్పులు వస్తాయని నిపుణులు పేర్కొన్నారు.
శరీర పలు రకాల నొప్పులు ఉత్పన్నమవుతాయి:
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు, పాదాలు, వేళ్లు, మడమలలో తిమ్మిరి వంటి సమస్యలు మొదవుతాయి. అంతేకాకుండా రాత్రి సమయంలో నొప్పులు కూడా వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇటు వంటి పరిస్థితుల్లో వీలైనంత త్వరగా హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
శరీరం అలసిపోయినట్లు అనిపించడం:
చాలా మందిలో శ్రమించిన తర్వాత శారీరం అలసిపోవడం చాలా సాధారణం, కానీ ఎలాంటి శ్రమ చేయకుండా త్వరగా అలసిపోతే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుతుందని సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Benefits of Jamun Fruit: వేసవిలో నేరేడు తింటే స్పెర్మ్ కౌంట్ అమాంతం పెరుగుతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.