Chronic Liver Disease Symptoms: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో కాలేయ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా చాలా మందిలో దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శరీరంలోని కాలేయం ఆహారాన్ని జీర్ణం చేయడం నుంచి అంటువ్యాధులతో పోరాడటం, రక్తంలో చక్కెరను నియంత్రించడం, విష పదార్థాలను తొలగించడం, కొవ్వును తగ్గించడం వరకు ముఖ్యమైన పాత్రలను పోషిస్తుంది.
అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు బయట ఫుడ్ అతిగా తినడం వల్ల చాలామందిలో కాలేయం చెడిపోతోంది. దీనికి తోడు ఆల్కహాల్ కూడా అతిగా తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల చాలామందిలో దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. అయితే చాలా మంది ఈ ఈ కాలేయ వ్యాధులను క్రోనిక్ లివర్ డిసీజెస్ అంటున్నారు. ఇంతకీ ట్రానిక్ లివర్ డిసీజ్ అంటే ఏమిటి? దీనివల్ల శరీరానికి వచ్చే నష్టాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
క్రోనిక్ లివర్ డిసీస్ ను ఎలా నిర్ధారిస్తారు:
ఈ కాలయ వ్యాధి చాలావరకు లక్షణ రహితంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ రక్త పరీక్ష పొట్ట అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ ఎలాస్టోగ్రఫీ ద్వారా సులభంగా ఈ వ్యాధి లక్షణాలు తెలుసుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
క్రానికల్ లివర్ డిసీస్ వ్యాధికి చికిత్స:
ఆల్కహాలిక్ లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా మద్యపానం సేవించడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రాథమిక చికిత్సలో భాగంగా ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని ఔషధాలను ప్రతిరోజు వినియోగించాల్సి ఉంటుంది. కారణంగా వాపు సమస్యలు, మానసిక పరిస్థితి, జీర్ణాశయ సమస్యలు, రక్తస్రావం వంటి సమస్యలు నియంత్రణలో ఉంటాయి. తరచుగా రక్తాన్ని వాంతి చేసుకునేవారు రెండోస్కోపిక్ చికిత్సను పొందడం చాలా మంచిది.
క్రానికల్ లివర్ డిసీస్ నుంచి ఇలా ఉపశమనం:
ఆలయ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా సులభంగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి ఈ క్రింది టిప్స్ కూడా అనుసరించి ఉపశమనం పొందవచ్చు.
✽ మద్యం అధికంగా సేవించడం మానుకోవాలి.
✽ ప్రతిరోజు తప్పకుండా వ్యాయామాలు చేయాలి.
✽ చెడు కొలెస్ట్రాల్ ప్రాసెస్ చేసిన ఆహారాలకు తప్పకుండా దూరంగా ఉండాలి
✽ శరీర బరువును నియంత్రించుకోవాల్సి ఉంటుంది
✽ బీపీ సమస్యలు ఉన్నవారు ఆహారం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
✽ ప్రతిరోజు కేవలం ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాలి.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter