Chyawanprash: వేసవిలో చవనప్రాశ్​ తీసుకోవడం వల్ల ఉపయోగాలు, నష్టాలు..

Chyawanprash: ఆరోగ్యం కోసం చాలా మంది చవనప్రాశ్​ తింటుంటారు. అయితే ఎండాకాలంలో చవనప్రాశ్​ను తీసుకోవచ్చా? తీసుకంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అనే అంశంపై ఆరోగ్య నిపుణుల సూచనలు మీకోసం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2022, 05:20 PM IST
  • చవనప్రాశ్​ వేసవిలో తీసుకోవచ్చా
  • ఎవరెవరు చవనప్రాశ్​ తీసుకుంటే మంచిది
  • చవనప్రాశ్ తీసుకోవడంలో జాగ్రత్తలు
Chyawanprash: వేసవిలో చవనప్రాశ్​ తీసుకోవడం వల్ల ఉపయోగాలు, నష్టాలు..

Chyawanprash: ఈసారి ఎండకాలం ఆరంభ దశలోనే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే సాధారణంగా ఆరోగ్యం కోసం చాలా మంది చవన ప్రాశ్​ తీసుకుంటుంటారు. వేడి చేస్తుందనే ఉంటుందనే కారణంగా ఎండాకాలకంలో చవనప్రాశ్​ తీసుకోవచ్చా అనే విషయంపై సందేహంలో ఉంటారు. మరి ఎండాకాలంలో చవనప్రాశ్​ తీసుకోవచ్చా? ఒకవేళ తీసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే ఎండాకాలం కావడంతో చవనప్రాశ్​ను వేడి పదార్థాలతో తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. చల్లటి పదార్థాలతో మితంగా తీసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచే జరుగుుతందని వివరిస్తున్నారు.

డాక్టర్​ను సంప్రదించాకే..

అయితే చవనప్రాశ్​ తీసుకోవాలనుకునేవారు ముందుగా డాక్టర్​ను సంప్రదించాలని చెబుతున్నారు. ఆరోగ్యపరంగా ఎలాంటి హానీ జరగదని నిర్ధారించుకున్నతర్వాతే చవన్​ప్రాశ్​ తీసుకోవాలని అంటున్నారు నిపుణులు.

అయితే వేసవిలో చవనప్రాశ్​ను అధికంగా తీసుకంటే.. అజీర్తి, కడుపు ఉబ్బరంగా అనిపించడం, లూజ్ మోషన్స్​ వంటి సైడ్​ ఎఫెక్ట్స్​ వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

చవనప్రాశ్​ సమస్యలు..

వేసవిలో చవనప్రాశ్​ అధికంగా తీసుకుంటే.. అలర్జీలు, దద్దుర్ల వంటి సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు.. మధుమేహం, బీపీ వంటి సమస్యలు ఉన్నవారు కచ్చితంగా వైద్యుడి సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. లేదంటే సైడ్​ ఎఫెక్ట్స్​ బారిన పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

పాటించాల్సిన జాగ్రత్తలు..

నిజానికి వేసవి వచ్చిందంటే.. తీసుకునే ఆహారంపట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. డీ హైడ్రేషన్​కు కారణమయ్యే ఆహారం, పానియాలను తీసుకోవద్దని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇక చవన ప్రాశ్​ తీసుకుంటే.. డైటీషియన్​ను కూడా సంప్రదించాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

దీర్ఘకాలిక సమస్యలు ఉన్నట్లయితే.. వైద్యుల సలహా మేరకు మాత్రమే చవనప్రాశ్​ వాడాలి.

Also read: Honey Facial Benefits: తేనె వినియోగంతో ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు!

Also read: Honey And Garlic Benefits: తేనె-వెల్లుల్లి కలిపి తీసుకోండి.. ఈ వ్యాధులకు చెక్ పెట్టండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News