Cinnamon Tea For Reduce Bad Cholesterol: చాలా మందిలో దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి ప్రధాన కారణాలు శరీరంలో జిడ్డు కొలెస్ట్రాల్ విచ్చలవిడిగా పెరగడమేనని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి వ్యాధులు బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది మార్కెట్లో లభించే చాలా రకాల మందులను వినియోగిస్తారు. వీటిని వినియోగించడం చాలా హానికరమని నిపుణులు చెబుతున్నారు. వీటికి బదులుగా ఆయుర్వేద నిపుణులు సూచించి సుగంధ ద్రవ్యంతో తయారు చేసిన టీని తాగడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు రాకుండా శరీరాన్ని రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన టీలను తాగడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆయుర్వేద గుణాలు కలిగిన దాల్చిన చెక్క టీని తాగడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా తీవ్ర చెడు కొలెస్ట్రాల్, గుండె నొప్పులతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఈ టీ ని తాగడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. కాకుండా చాలా రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్క టీ ని ప్రతిరోజు తాగిన వారిలో చాలామంది నెల తర్వాత రెండు కిలోలకు పైగా బరువు తగ్గాలని సమాచారం. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు రెండు కప్పుల చొప్పున ఈ టీ ని తాగాల్సి ఉంటుంది.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
రక్తంలో చక్కెర పరిమాణాలు క్రమంగా పెరగడం కారణంగా చాలామందిలో మధుమేహం తీవ్రతరమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ ని ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది. ఈ టీ ని తాగడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు దగ్గరమే కాకుండా మధుమేహం కారణంగా వచ్చే దీర్ఘకాలిక వ్యాధులను దూరమవుతాయి.
దాల్చిన చెక్క టీలో చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. ముఖ్యంగా గుండెపోటు సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఈ టీ ని ఖాళీ కడుపుతో తాగడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. తరచుగా గుండెపోటు కారణంగా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు దాల్చిన చెక్కతో తయారుచేసిన టీని తాగాల్సి ఉంటుంది.
మార్కెట్లోకి ప్రాసెస్ చేసిన ఆహారాలను అతిగా తినడం కారణంగా చాలామందిలో తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి వీటితో పాటు పొట్ట సంబంధిత సమస్యలు కూడా వస్తున్నాయి కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా దాల్చిన చెక్కటి తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు మలబద్ధకం గ్యాస్ వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా ప్రభావంతంగా సహాయపడతాయి.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook