Women Health: మహిళలు తరచూ ఇబ్బంది పడే పోషక లోపాలు.. నిర్లక్ష్యం చేయకండి

Nutritional Deficiencies: మహిళలు ఇంట్లో అందరి ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. కానీ తరచూ తమ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టడం మర్చిపోతారు. అందుకే వాళ్లలో కామన్ గా కొన్ని న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ గుర్తించవచ్చు. అయితే ఇది అలాగే కొనసాగితే చాలా ప్రమాదం. అసలు ఆ డెఫిషియన్సీస్ ఏవి?వాటిని ఎలా గుర్తించవచ్చు? తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2023, 07:52 PM IST
Women Health: మహిళలు తరచూ ఇబ్బంది పడే పోషక లోపాలు.. నిర్లక్ష్యం చేయకండి

Women health : సహజంగా మహిళల్లో తమ పట్ల శ్రద్ధ తీసుకొని ఆసక్తి చాలా తక్కువగా ఉంటుంది. కుటుంబ, ఉద్యోగ బాధ్యతలు ఇందుకు ముఖ్య కారణం అని చెప్పవచ్చు. అయితే మహిళల్లో తరచూ తలెత్తే కొన్ని పౌష్టిక లోపాల వల్ల క్రమంగా దీర్ఘకాలిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మనలో చాలామంది కండరాల తిమ్మిరెక్కడం ,కాళ్ళ నొప్పులు లాంటి సమస్యలతో తరచూ ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇది అలసట వల్ల అనుకుంటారే తప్ప పౌష్టిక ఆహార లోపం వల్ల అని ఎవరు గుర్తించరు.

మహిళలకు ముఖ్యంగా కావలసిన పోషక విలువలు ఏమిటి ?అవి మన శరీరానికి అందకపోతే మన శరీరం పై ఎటువంటి ప్రభావం చూపిస్తాయి అన్న విషయాన్ని తెలుసుకుందాం. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఎంతో ముఖ్యమైనది ఐరన్. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న మహిళలకు అలసట ,బలహీనత ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా తగ్గుతుంది కాబట్టి వీళ్ళు తరచూ ఇన్ఫెక్షన్స్ కి గురి అవుతూ ఉంటారు.

మీ శరీరంలో విటమిన్ డి ,కాల్షియం లోపించినప్పుడు ఎముకలు బలహీనపడడంతో పాటు దంతాలు కూడా త్వరగా అరిగిపోతాయి. క్యాల్షియం లోపం కారణంగా తరచూ కండరాలు తిమ్మిరి పట్టడం, కీళ్ల నొప్పులు ఎక్కువ అవుతాయి.ఫోలేట్ లేక ఫోలిక్ యాసిడ్ శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఫోలిక్ యాసిడ్ లోపించడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాగే ఆడవారికి శరీరంలో మెగ్నీషియం శాతం తగ్గడం వల్ల ఒత్తిడి, హార్మోన్ అసమతుల్యత ఏర్పడుతుంది.

మీరు తరచూ ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే మీలో విటమిన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంది అని అర్థం .అందుకే మీరు సరైన పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువగా తాజా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు మీ డైట్ లో భాగంగా ఉండేలా జాగ్రత్తగా తీసుకోవాలి. క్రమబద్ధమైన జీవన శైలిని అలవాటు చేసుకోవడమే కాకుండా రోజు కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి. 

ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన మహిళలు అలానే పిల్లలను కన్న తరువాత మహిళలు.. వీటి గురించి తెలుసుకొని తప్పకుండా శ్రద్ధ తీసుకోవడం మంచిది.

గమనిక:  పైన ఇవ్వబడిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది. ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

Also Read:  Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా

Also Read:  Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FaceTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News