Lemon Drinks for Kidney: మన శరీరంలో కిడ్నీలు రక్తాన్ని శుభ్రపరచడానికి, శరీరం నుంచి చెడు రక్తాన్ని తొలగించేందుకు పనిచేస్తాయి. అయితే చాలామంది కిడ్నీలో రాళ్లు ఉన్నాయని.. కిడ్నీలు పాడయ్యాయని ఇలా అనే సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. డయాలసిస్ చేయించుకునేందుకు హస్పిటల్ చుట్టూ తిరగడం మనం చూస్తునే ఉన్నాం. కానీ ఒక డ్రింక్ తాగడం ద్వారా కిడ్నీలను శుభ్రపరచవచ్చు. అంతేకాకుండా కిడ్నీ దెబ్బతినకుండా నిరోధించవచ్చు.
మూత్రపిండాలు మన శరీరంలోని మురికిని, చెడు ద్రవాలను మూత్రం ద్వారా శరీరం నుంచి తొలగిస్తాయి. ఇది కాకుండా మానవ శరీరంలోని ఉప్పు, పొటాషియం, యాసిడ్ పరిమాణాన్ని కూడా నియంత్రిస్తాయి. మన శరీరంలోని ఇతర భాగాలు పనిచేయడానికి అవసరమైన హార్మోన్లు కూడా మూత్రపిండాల నుంచి విడుదలవుతాయి.
నిమ్మకాయ మూత్రపిండాలకు మేలు చేస్తుంది
హార్వర్డ్ నివేదిక ప్రకారం.. రోజూ నిమ్మరసం తాగడం వల్ల యూరినరీ సిట్రేట్ పెరుగుతుంది. కిడ్నీ నుంచి టాక్సిన్స్ తొలగిపోతాయి. అదేవిధంగా మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. మీరు ఈ కిడ్నీ హెల్తీ డ్రింక్‌ను ఉదయం, మధ్యాహ్నం తాగవచ్చు.
కిడ్నీ కోసం నిమ్మ పానీయాలు
1. పుదీనాతో నిమ్మకాయ
నిమ్మరసం, పుదీనా ఆకులు, కొంత చక్కెరను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా కలపండి. మూత్రపిండాల కోసం ఈ ఆరోగ్యకరమైన పానీయాన్ని తాగండి.
2. మసాలా లెమన్ సోడా
ఒక గ్లాసులో నిమ్మరసం, జీలకర్ర-కొత్తిమీర పొడి, చాట్ మసాలా, సోడా కలపండి. ఈ విధంగా మీ కిడ్నీకి హెల్తీ డ్రింక్ తయారవుతుంది.
3. కొబ్బరి షికంజీ
ఈ హెల్తీ కిడ్నీ డ్రింక్ చేయడానికి ఒక గ్లాసులో కొబ్బరి నీళ్ళు పోయాలి. ఈ నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగాలి. ఇంట్లోనే సింపుల్ ట్రిక్స్ పాటించి కిడ్నీ సమస్యలను దూరంగా ఉండండి.
(గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం, సలహాలు స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Happy Birthday Rajinikanth: రజినీకాంత్ కోసం శ్రీదేవి ఏడు రోజులు ఉపవాసం.. కారణం తెలుసా..!
Also Read: SIPB: ఏపీలో రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్.. భారీగా ఉద్యోగ అవకాశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook