Best Drinks For Dengue Fever: డెంగ్యూ జ్వరం అనేది ఏడెస్ ఈజిప్టి, ఏడెస్ ఎల్బోపిక్టస్ అనే రెండు రకాల దోమలు కుట్టడం వల్ల వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్. ఈ జ్వరం ప్రపంచంలోని ఉపఉష్ణమండల ప్రాంతాలలో జీవించే ప్రజలకు ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీని బారిన పడిన వారిలో తీవ్రమైన రక్తస్రావంతో పాటు రక్తంలోని ప్లేట్ లెట్స్ తగ్గిపోయే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు కొంతమందిలో హృదయ స్పందనలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే ప్రాణాంతకంగా మరే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఈ సమయంలో తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు పండ్ల రసాలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటి వల్ల సులభంగా శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి అనేక ఈ డెంగ్యూ జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది.
డెంగ్యూతో బాధపడేవారు తప్పకుండా ఈ రసాలు తాగండి:
బొప్పాయి పండు రసం:
బొప్పాయి పండు రసం తాగడం వల్ల డెంగ్యూ జ్వరం కారణంగా రక్తంలోని తగ్గే ప్లేట్లేట్స్ పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా జ్వరం కారణంగా వచ్చే నొప్పిని తగ్గించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జ్వరాన్ని తగ్గించేందుకు ఎంతగానో సహాయపడతాయి. ఇతర సమస్యల నుంచి కూడా ఎంతో సులభంగా విముక్తి లభిస్తుంది.
సోరకాయ రసం:
సోరకాయ పండు కాకపోయిన డెంగ్యూ జ్వరంతో బాధపడేవారు ఈ రసాన్ని తగ్గడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జ్వరం కారణంగా వచ్చే రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరానికి తగిన మోతాదులో విటమిన్ సి లభించి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
ద్రాక్షారసం:
ద్రాక్షారసం డెంగ్యూ జ్వరం వల్ల కలిగే అలసట, బలహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
నారింజ రసం:
నారింజ రసం డెంగ్యూ జ్వరం వల్ల కలిగే కండరాల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి