చలికాలంలో దోమల బెడద సహజంగానే అధికంగా ఉంటుంది. దోమకాటు కారణంగా వ్యాపించే వ్యాధుల్లో ప్రమాదకరమైంది డెంగ్యూ. ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా మూల్యం చెల్లించుకోవల్సిందే. అందుకే కొన్ని విషయాల్ని పరిగణలో తీసుకోవల్సి ఉంటుంది.
డెంగ్యూ వ్యాధి అనేది ఎడిస్ జాతికి చెందిన దోమకాటుతో ప్రబలుతుంది. డెంగ్యూ సోకినప్పుడు సంబంధిత వ్యక్తిలో ప్లేట్‌లెట్ కౌంట్ అతివేగంగా తగ్గిపోతుంది. సకాలంలో చికిత్స లేకపోతే ప్రాణం కూడా పోవచ్చు. ఇప్పుడు చలికాలం ప్రారంభం కావడంతో దోమల బెడద ఎక్కువై..డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. తీవ్రమైన జ్వరం, తలపోటు, అలసట, ప్లేట్‌లెట్ కౌంట్ విపరీతంగా తగ్గడం ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. ఆశ్చర్యమేమంటే డెంగ్యూ దోమ శుభ్రమైన నీటిలోనే జీవిస్తుంది. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా డెంగ్యూ నుంచి సంరక్షించుకోవచ్చు.
డెంగ్యూ లక్షణాలు
డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయనేది చాలామందికి తెలియదు. అందుకే కొన్ని లక్షణాల్ని సాధారణమే అనుకుని తేలిగ్గా తీసుకుంటారు. ఇష్టానుసారం తోచిన మందులు వేసుకుంటుంటారు. ఫలితంగా ప్లేట్‌లెట్ కౌంట్ వేగంగా తగ్గిపోయి..ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే..ముందు డెంగ్యూ లక్షణాలేంటో తెలుసుకోవాలి. డెంగ్యూ సోకినప్పుడు తీవ్రమైన తలనొప్పి, జ్వరం, మజిల్స్ పెయిన్, ఎముకలు, కీళ్ల నొప్పులు, వాంతులు కన్పిస్తాయి. అంతేకాకుండా కళ్ల వెనుక నొప్పి, గ్రంధుల్లో స్వెల్లింగ్, ర్యాషెస్ ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.
ఆహారం
డెంగ్యూ లక్షణాలు సహజంగా 2-7 రోజులవరకూ ఉంటాయి. చాలామందికి 1 వారంలోగా నయమౌతుంది. అయితే వ్యాధి ముదిరినప్పుడు మాత్రం నయమయ్యేందుకు చాలా సమయం పడుతుంది. డెంగ్యూ సోకినప్పుడు బొప్పాయి ఆకుల రసం అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. దీంతోపాటు కొబ్బరినీళ్లు, పసుపు, పుల్లటి పండ్లు తప్పకుండా తినాలి. అదే సమయంలో టీ, కాఫీ, సోడా, సాఫ్ట్ డ్రింక్స్, మసాలా భోజనం, ఫ్రైడ్ పదార్ధాలకు దూరంగా ఉండాలి.
డెంగ్యూ పరీక్ష
డెంగ్యూ సోకితే యాంటీజెన్, ఎలీసా పరీక్షలు చేస్తారు. ఇందులో కూడా ఐజీఎం, ఐజీజీ పేర్లతో రెండు పరీక్షలుంటాయి. ఐజీఎం పరీక్షను డెంగ్యూ లక్షణాలు బయటపడిన 3-5 రోజుల్లోగా చేయాించాలి. అటు ఐడీజీ పరీక్షను 5-10 రోజుల్లోగా చేయించాల్సి ఉంటుంది.
డెంగ్యూ సోకకుండా జాగ్రత్తలు
ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఇంటి పరిసరాల్లో కీటనాశక మందులు స్ప్రే చేయాలి. శరీరం పూర్తిగా కప్పి ఉండేలా వస్త్రాలు ధరించాలి. నిద్రించేటప్పుడు దోమతెరలు, దోమ నివారణ మందులు వినియోగించాలి. తినే ఆహార పదార్ధాల్ని ఎప్పుడూ కప్పి ఉంచాలి.
నోయిడా ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వైద్యుల ప్రకారం..ఇంటి పరిసరాల్లో ఎక్కువసేపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో దోమలు వృద్ధి చెందుతాయి. కాళ్లు చేతులు కప్పుకుని ఉంచడం మంచిది. డెంగ్యూ ఉన్నప్పుడు తీవ్రమైన జ్వరం, బలహీనత ఉంటాయి. సకాలంలో పరీక్షలు చేయించుకోవాలి. చికెన్ గున్యా, కోవిడ్ లక్షణాలు కూడా కాస్త ఇలానే ఉంటాయి.
డెంగ్యూ లక్షణాల్లో తలతిరగడం, నోరు ఎండిపోవడం, మూత్రం తగ్గడం వంటి డీహైడ్రేటెడ్ లక్షణాలుంటాయి. ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. డెంగ్యూ రోగులకు ఆసుపత్రిలో చికిత్స అవసరం. ఇంట్లో ఉంటే మాత్రం తగిన స్వచ్ఛత, ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టాలి. ప్రతిరోజూ తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి.
Also read: Weight Loss Tips: చలి కాలంలో ప్రతి రోజూ ఈ జ్యూస్ తాగితే.. కేవలం 7 రోజుల్లో శరీర బరువుకు చెక్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook