Diabetes Control in Home: రక్తంలో చక్కెర పరిమాణాలు విచ్చలవిడిగా పెరగడం వల్ల మధుమేహం తీవ్ర తరమయ్యే అవకాశాలున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీపి అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు కూడా అతిగా తినకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవడానికి తప్పకుండా పలు ఇంటి చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది. మధుమేహాన్ని నియంత్రించుకోవడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నేరేడు పండ్లు రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది:
నేరేడు పండ్లు శరీరానికి అన్ని రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇందులో ఉండే గుణాలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఈ పండ్ల విత్తనాలతో తయారు చేసిన పొడిని టీలో కలుపుకుని తాగడం వల్ల మధుమేహం సులభంగా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలి వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయి. అయితే బరువు తగ్గాలనుకునేవారు కూడా ఈ నేరేడు పండు విత్తనాలు తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.
అంజీర్ ఆకులు:
మధుమేహంతో బాధపడుతున్నవారికి అంజీర్ ఆకులు కూడా ప్రభావవంతంగా సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో అంజీర్ ఆకులను నమిలి తింటే సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించుకోవచ్చు. అంతేకాకుండా పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి.
మెంతులు:
రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటేనే మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. తరచుగా తీవ్ర మధుమేహం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మెంతి గింజలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ పరిమాణాలను కూడా నియంత్రిస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook