Diabeties Control: షుగర్ పేషెంట్స్ కి దివ్య ఔషధం.. ఇదొక్కటి ఉంటే షుగర్ ని తరిమేయచ్చు..

Diabetics Diet : అధిక షుగర్ లెవెల్స్ తో బాధపడుతున్నారా? ఇప్పుడు చాలామందిలో డయాబెటిస్ కామన్ అయిపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఆహార అలవాట్ల కారణంగా షుగర్ బారిన పడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఒకే ఒక్క పదార్థం మన శరీరంలో ఉన్న షుగర్ ను ఒక కంట్రోల్ చేయగలదు. అదేంటో తెలుసుకుందాం.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 20, 2024, 01:20 PM IST
Diabeties Control: షుగర్ పేషెంట్స్ కి దివ్య ఔషధం.. ఇదొక్కటి ఉంటే షుగర్ ని తరిమేయచ్చు..

Diabetics Control Tips: నేరేడు పండ్ల గురించి తెలియని వారు ఉండరు. కానీ తినేవాళ్లు మాత్రం తక్కువ మందే ఉంటారు. అయినప్పటికీ ఎవరూ ఊహించినటువంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు నేరేడు పళ్ళ వల్ల కలుగుతాయి. నేరేడు పండు తింటే శరీరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఇక నేరేడు పండు గురించి పక్కన పెడితే వాటి ఆకులలో ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడుతున్న వాళ్ళు తమ బ్లడ్ షుగర్ లెవెల్ ను కంట్రోల్ లో ఉంచుకోవడానికి నేరేడు ఆకులను వినియోగించుకోవచ్చు.

మన శరీరంలో ఉన్న గ్లూకోజ్ ను శక్తిగా మార్చడానికి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వకపోతే వచ్చే ఆరోగ్య పరిస్థితిని డయాబెటిస్ అంటారు. షుగర్ వల్ల ఎన్నో ఇబ్బందులకు పడాల్సి ఉంటుంది. కానీ అలాంటి షుగర్ పేషెంట్స్ కి సమర్థవంతంగా తమ రక్తంలో చక్కర స్థాయిని తగ్గించగల ఒక ఆయుర్వేద హోమ్ రెమిడి ఉంది.

మనం రక్తంలో ఉన్న షుగర్ లెవెల్స్ పర్యవేక్షించడంలో ఉపయోగపడే వివిధ ఆహార పదార్థాల్లో నేరేడు పండు కూడా ఒకటి. నేరేడు పండ్ల రసం మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇక నేరేడు ఆకులు షుగర్ ఉన్నవారికి దివ్య ఔషధంగా చెప్పుకోవచ్చు. ఈ ఆకులు అధిక రక్త చక్కర ను కూడా సహజంగా బాలన్స్ చేస్తాయి. 

బ్లడ్ లో షుగర్ లెవెల్స్ నియంత్రించడంలో నేరేడు ఆకులు బాగా ఉపయోగపడతాయి. నేరేడు ఆకులు ఇన్సులిన్ ని పెంచుతాయి. దానివల్ల బ్లడ్ షుగర్ నియంత్రణ అవుతుంది. ఆ విధంగా షుగర్ పేషెంట్స్ కి ఇది ఒక దివ్య ఔషధం. ఇక నేరేడు ఆకులలో  పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా రక్షణ ఇస్తూ ఉంటాయి. షుగర్ పేషంట్స్ కి  ఇది కూడా చాలా ముఖ్యమైనది. 

నేరేడు ఆకులు బరువు నిర్వహణలో కూడా బాగా సహాయపడతాయి. షుగర్ ఉన్న వాళ్ళు అధిక బరువు ఉండకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయం లో కూడా నేరేడు ఆకులు బాగా ఉపయోగపడతాయి. 

అంతేకాకుండా మధుమేహంతో సంబంధం ఉన్న డయాబెటిక్ రెటీనాపతి, న్యూరోపతి వంటి ఎన్నో ప్రమాదాలను తగ్గించడంలో కూడా ఈ నేరేడు ఆకులు బాగా ఉపయోగపడతాయి. రాత్రి పడుకునే ముందు ఒక్క నేరేడు ఆకుని నమిలి పడుకుంటే చాలు కొద్ది రోజుల్లోనే మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి.

Read More: Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?

Read More: Sai Pallavi Dance: షీలా.. షీలా కి జవానీ పాటకు మెస్మరైజింగ్ స్టెప్పులు వేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News