Eggs for Health | గుడ్లు తినడం ఆరోగ్యానికి పలు రకాలుగా శ్రేయస్కరం. దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. గుడ్లను ఉడకబెట్టి, ఫ్రై చేసి, కూరల్లో ఇలా రకరకాలుగా తీసుకుంటారు. వర్కవుట్స్ చేసే వాళ్లు ప్రోటీన్స్ కోసం లెక్కబెట్టుకుండా గుడ్లు తింటారు. ఇందులో ప్రొటీన్స్ తో పాటు, మినరల్స్, హెల్తీ ఫ్యాట్ వంటి పోషకాలు ఉంటాయి. Also Read WhatsApp Mute: ఇక వాట్సాప్ లో వీడియో పంపించే ముందు మ్యూట్ చేయవచ్చు
టైమ్ పాస్ అవకనో, ఇమోషనల్ ఈటింగ్ ( Emotional Eating ) అని కొంత మంది ఎప్పుడంటే అప్పుడు ఎగ్స్ తినేస్తుంటారు. అయితే ఇలా చేయడం మంచిది కాదంటున్నారు పోషకాహార నిపుణులు. తాజాగా ఒక పరిశోధనలో ఇదే విషయం తేలింది. దాని ప్రకారం.
1. మీరు ఎక్కువగా గుడ్లను ( Eggs ) తీసుకుంటే డయాబెటిస్ ముప్పు పొంచి ఉంటుంది. చైనాకు చెందిన ఒక మెడికల్ విశ్వవిద్యాలయం, ఖతార్ లోని యూనివర్సిటీ కిలిసి ఒక పరిశోధన నిర్వహించి ఈ విషయం కనుగొన్నారు. లెక్కకు మించి గుడ్లు తీసుకుంటే మీకు డయాబెటిస్ వచ్చే ప్రమాదం 60 శాతం పెరుగుతుందట.
Also Read | Tip To Get Rich: వాస్తుశాస్త్రంలోని ఈ చిట్కాలు పాటిస్తే మీరు ధనవంతులు అవుతారు
2. పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే గుడ్లు తినే అలావాటు ప్రకారం మీరు ఏళ్ల తరబడీ తింటూ ఉంటే ..ప్రతీ సంవత్సరం మెల్లిమెల్లిగా అవసరం ఉన్న దానికన్నా ఎక్కువగా తినేస్తామట.
3. ఇలా ప్రతీ రోజు 38 గ్రాముల తీసుకుంటే మధుమేహం ( Diabetes ) వచ్చే అవకాశం 25 శాతం పెరుగుతుందట
4. ప్రతీ రోజు 50 గ్రాములు తీసుకుంటే ప్రమాదం పెరిగి 60 శాతానికి చేరుతుందట.
5. వైద్యుల ప్రకారం మన తిండి అలవాట్లు, టైప్ టూ డయాబెటిస్ తో సంబంధం ఉంది. సరైన ఆహారంతో మనం మధుమేహాన్ని అదుపు చేయవచ్చట.
ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) ఒక రిపోర్ట్ జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆరు శాతం మంది సరైన జీవన విధానం లేకపోవడం వల్లే అనారోగ్యాలకు గురి అవుతున్నారుట. ఈ సంఖ్య మరింతగా పెరుగుతోంది.
Also Read | Photo Story: నటాలియా గరిబోటో ఎవరు ? పోప్ నిజంగా ఆమె ఫోటోకు లైక్ కొట్టారా?
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR