Diabetic Patients: మధుమేహం ఉన్నవారు ప్రతి రోజూ ఇలా యోగా చేస్తున్నారా.. ఇక అంతే సంగతి..

Worst Yoga For Diabetic Patients: మధుమేహంతో బాధపడుతున్నవారు చాలా మంది యోగాసనాలు వేస్తున్నారు. అయితే రోజూ వ్యాయామాలు, యోగా చేయడం శరీరానికి చాలా మంచిదైనప్పటికీ మధుమేహంతో బాధపడుతున్నవారికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2022, 10:34 AM IST
Diabetic Patients: మధుమేహం ఉన్నవారు ప్రతి రోజూ ఇలా యోగా చేస్తున్నారా.. ఇక అంతే సంగతి..

Worst Yoga For Diabetic Patients: మధుమేహం ప్రస్తుతం సాధరణ సమస్యగా మారిపోయింది. ప్రతి ఇంట్లో ఒక్కరైనా ఈ డయాబెటిస్‌ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు ప్రతి రోజూ తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. డయాబెటిస్‌ ఉన్నవారు రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించుకోవడానికి తప్పకుండా వ్యాయామాలతో పాటు యోగా చేయాల్సి ఉంటుంది. అయితే యోగా చేసే క్రమంలో తప్పకుండా మధుమేహాన్ని దృష్టిలో పెట్టుకుని యోగాసనాలు వేయాల్సి ఉంటుంది. కొందరతై విచ్చల విడిగా అన్ని రకాల ఆసనాలు వేస్తున్నారు. దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి మధుమేహం ఉన్నవారు ఇలాంటి ఆసనాలు వేయకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

డయాబెటిస్‌ పేషెంట్లు అస్సలు ఇలాంటి ఆసనాలు వేయకపోవడం మంచిది:
శీర్షాసనం:

ప్రస్తుతం చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నవారు యోగా క్రమంలో శీర్షాసనం వేస్తున్నారు. అయితే ఈ ఆసనం వేయడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  

శలభాసం:
శలభాసం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలిగినప్పటికీ మధుమేహంతో బాధపడుతున్నవారికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఆసనం వేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగే ఛాన్స్‌ కూడా ఉంది. కాబట్టి దీనిని వేయకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

మయూరసం:
మధుమేహ వ్యాధితో బాధపడుతున్నవారు మయూరాసనానికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా చాలా మందిలో రక్త పోటు సమస్యలు వస్తున్నాయని..కాబట్టి ఈ ఆసనాన్ని వేయకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా మయూరసం క్రమం తప్పకుండా వేయడం వల్ల రక్త ప్రవాహ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.

చక్రాసం:
డయాబెటిస్‌ పేషెంట్లు చక్రసనం వేయకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ యోగాసనం వేసేటప్పుడు నడుము పూర్తిగా తిప్పాల్సి ఉంటుంది. కాబట్టి దీని  వల్ల గుండె వేగం పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి ఆరోగ్య నిపుణులు పేర్కొన్న ఇలాంటి ఆసనాలు వేయకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: SBI Interest Rate Hike: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్.. నేటి నుంచే అమలు  

Also Read: CM Nitish Kumar: సారా తాగితే చావడం ఖాయం.. కల్తీ మద్యం మరణాలపై సీఎం నితీశ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x