Post Pregnancy Diet Plan: ప్రెగ్నన్సీ తరువాత స్త్రీలందరు వారి శరీర బరువు తగ్గించుకొని, తిరిగి సాధారణ శరీర బరువును, ఆకృతిని పొందాలి అనుకుంటారు. నిజానికి ప్రెగ్నన్సీ తరువాత శరీర బరువు తగ్గించుకోవటం చాలా కష్టం అని చెప్పవచ్చు. ప్రెగ్నన్సీ తరువాత శరీర బరువు తగ్గించుకోటానికి, గర్భానికి ముందు పాటించిన ఆరోగ్యకర జీవనశైలితో పాటు, సహనం, అంకిత భావంతో, వాస్తవికంగా మరియు సానుకూల దృక్పథంతో ప్రయత్నించాలి.
ప్రెగ్నన్సీ తరువాత స్త్రీలు మంచి ఆహారాలతో పాటు, వ్యాయామాలను అనుసరించటం వలన శరీర బరువు తగ్గించుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ప్రెగ్నన్సీ ముగిసిన తరువాత, ఆహార సేకరణలో కొన్ని సవరణలను అనుసరించటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ప్రెగ్నన్సీ తరువాత బరువు తగ్గించుకోటానికి ఆహారంలో కలుపుకొవలసిన ఆహార పదార్థాల గురించి కింద పేర్కొనబడింది.
కరిగే ఫైబర్‌లు
కరిగే ఫైబర్‌లను మీరు పాటించే ఆహార ప్రణాళికలో కలుపుకోండి. హోల్ గ్రైన్స్, బెర్రీలు, బ్రౌన్ రైస్ మరియు పండ్లలో కరిగే ఫైబర్ లు అధిక మొత్తంలో ఉంటాయి. కడిగే ఫైబర్‌లు జీర్ణక్రియను మెరుగుపరిచి, అదనపు కొవ్వు పదార్థాలు, చక్కెరలు మరియు పిండిపదార్థాలను గ్రహించటాన్ని మరియు నిల్వలను తగ్గిస్తాయి. వరి, ఓట్స్, చాయ్ మరియు బార్లీ వంటి వాటిలో నీటిలో కరిగే ఫైబర్ లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా, ఫైబర్ అధికంగా ఉన్న పదార్థాలను ఎక్కువగా తినటం వలన ఆకలి ఎక్కువగా అనిపించదు మరియు గర్భం తరువాత ఉన్న అధిక బరువును సులభంగా తగ్గిస్తాయి.
Also Read: T20 World Cup 2021: IND Vs PAK మ్యాచ్‌ల్లో అతి పెద్ద కాంట్రావర్శీలు, ఎప్పటికీ గుర్తుండే హైలైట్స్
శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి
ప్రెగ్నన్సీ తరువాత శరీర బరువును తగ్గించుకోటానికి అందుబాటులో ఉన్న మరొక పద్దతి- శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవటం. అధికంగా నీటిని తాగటం వలన శరీరంలో ఉండే విష పదార్థాలు భయటకు పంపబడి, చివరగా శరీర బరువు తగ్గించబడుతుంది. భోజనానికి ముందు ఒక గ్లాసు మంచి నీటిని తాగండి. దీని వలన ఆకలిగా అనిపించటం తగ్గి, ఆహరం తక్కువ తీసుకుంటారు. ఇలా ప్రెగ్నన్సీ తరువాత భోజనాన్ని నియంత్రణలో తీసుకోవటం వలన శరీర బరువు తగ్గుతుంది.
పండ్లు
ప్రతి రోజు 5 రకాల పండ్లను తినండి. ప్రెగ్నన్సీ తరువాత పాటించే ఆహార ప్రణాళికలో అధిక మొత్తంలో ఆకుకూరలు మరియు పండ్లు ఉండేలా ప్రణాళికను రూపొందించుకోండి. కొన్నిసార్లు, భోజనానికి బదులుగా కేవలం పండ్లను మాత్రమే తినవచ్చు.
Also Read: Samantha Defamation Case: సామాన్యులైన... సమంత అయినా... ఒక్కటే: కూకట్‌పల్లి కోర్టు
సూప్స్
ప్రెగ్నన్సీ తరువాత శరీర బరువు తగ్గించుకోటానికి గానూ, వారంలో 3 సార్లు సూప్‌లను తాగండి. అధిక బరువును తగ్గించుటలో ఈ పద్దతి కూడా శక్తివంతంగా పని చేస్తుంది. సూప్‌లలో తక్కువ క్యాలోరీలు, అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉండి, పొట్ట నిండినట్టుగా నిపించేలా చేస్తాయి.
క్యాలోరీల లెక్కింపు
బరువు నిర్వహణ అనేది తీసుకునే మరియు ఖర్చు చేసే క్యాలోరీల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. భోజనం ఎక్కువగా చేసి అధిక క్యాలోరీలను తీసుకుంటే తరువాత భోజనంలో క్యాలోరీలను తక్కువగా తీసుకోవాలి. ఇలా రోజు తీసుకునే క్యాలోరీల సంఖ్యపై పూర్తి అవగాహాన కలిగి ఉండాలి. మధ్యాన్న భోజనం అధికంగా తిన్నట్లయితే రాత్రి తక్కువ క్యాలోరీలను అందించే బటర్ మిల్క్ లేదా మీగడ తీసిన పాలను తాగాలి. తీసుకునే క్యాలోరీల లెక్కింపుతో పాటుగా, వ్యాయామాలు, ఇతర పనుల ద్వారా ఖర్చు చేసే క్యాలోరీల సంఖ్యను కూడా లెక్కించాలి.
చాక్లెట్లకు దూరంగా ఉండండి
చాక్లెట్ షేక్స్, హాట్ చాక్లెట్ మరియు చల్లబరచిన చాక్లెట్ డ్రింక్స్ తక్కువ స్థాయిలో పోషకాలను కలిగి ఉంటాయి. తినే చాక్లెట్ల కన్నా చాక్లెట్ ద్రావణాల ద్వారా శరీరానికి అధిక మొత్తంలో క్యాలోరీలు అందించబడి, బరువు తగ్గే ప్రయత్నాన్ని విఫలం చేస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook