Liver: ఈ సంకేతాలు కనిపిస్తే మీ లివర్‌ డ్యామేజ్ అయినట్లే..!

Liver Health Test: లివర్‌ ఎంతో ముఖ్యమైన అవయవం. ఇది విషపురితమైన రసాలను తొలగించడంలో సహాయపడుతుంది. అయితే కొన్ని సంకేతులు లివర్‌ అనారోగ్యంగా ఉందని తెలియజేస్తాయి. అలాగే లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం.   

Written by - Shashi Maheshwarapu | Last Updated : Oct 29, 2024, 02:50 PM IST
Liver: ఈ సంకేతాలు కనిపిస్తే మీ లివర్‌ డ్యామేజ్ అయినట్లే..!

Liver Health Test: లివర్‌ అనేది మన శరీరంలో ఒక అవయవం. లివర్‌ దెబ్బతింటే తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి లివర్‌ ఆరోగ్యంగా ఉందా లేదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే లివర్‌ అనారోగ్యంగా ఉందని తెలియజేసే కొన్ని సంకేతాలు మనకు కనిపిస్తాయి. అలాంటి సమయంలో మీరు వెంటనే లివర్‌ సంరక్షణపై శ్రద్ధ వాహించాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో మనం తెలుసుకుందాం. 

లివర్ దెబ్బతినే ముందు మీ పాదాల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. తరుచుగా పాదాల్లో దురద రావడం, చికాకు కలిగించే లక్షణాలు లివర్‌ అనారోగ్యంగా ఉందని తెలియజేస్తాయి. డయాబెటిస్‌ఉన్నవారు లివర్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. సాధారణంగా శరీరంపై ఎరుపు, గోధుమ రంగు మచ్చలు కనిపిసత్ఆయి. దీని కారణంగా లివర్‌ సరిగ్గా పనిచేయడం లేదని ఆర్థం చేసుకోవాలి. అలాగే శరీరంలో విటమిన్‌ కె, ఒమేగా3 తగ్గిందని గ్రహించాలి. దీని వల్ల పాదంపై ముదుతలు కలుగుతాయి.  

కేవలం పాదం మాత్రమే కాకుండా కాలి గోళ్ళు కూడా లివర్‌ గురించి బోలెడు విషయాలు చెబుతాయి. మీరు గోళ్ళను చూసి కూడా లివర్‌ ఆరోగ్యంగా ఉందా లేదా అని చెబుతారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వ్యాధుడిని కలవడం చాలా అవసరం. వారు తగిన చికిత్సను అందిస్తారు. 

లివర్‌కు మంచి ఆహారాలు:

పండ్లు: ఆపిల్, బెర్రీలు, ద్రాక్ష, నారింజ వంటి పండ్లు ఫైబర్, విటమిన్లు  యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి లివర్‌ను శుభ్రపరచడంలో సహాయపడతాయి.

ఆకుకూరలు: పాలకూర, బ్రోకలీ, కాలే వంటి ఆకుకూరలు విటమిన్ K, ఫోలేట్‌లకు మంచి మూలం. ఇవి లివర్‌లో కొవ్వు నిల్వను తగ్గించడంలో సహాయపడతాయి.

బీన్స్: బీన్స్ ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి లివర్‌కు మంచి ఆహారం.

బ్రౌన్ రైస్: బ్రౌన్ రైస్ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇది లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

అవకాడో: అవకాడో హెల్దీ ఫ్యాట్స్‌కు మంచి మూలం. ఇది లివర్‌లో కొవ్వు నిల్వను తగ్గించడంలో సహాయపడుతుంది.

వెల్లుల్లి: వెల్లుల్లి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది లివర్‌ను శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

ఇంగువ: ఇంగువ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది లివర్‌ను శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

లివర్‌కు మంచి పానీయాలు:

నీరు: నీరు శరీరంలోని విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది.
గ్రీన్ టీ: గ్రీన్ టీ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది లివర్‌ను శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

లివర్‌కు హాని కలిగించే ఆహారాలు:

చక్కెర: అధిక చక్కెర తీసుకోవడం లివర్‌కు హాని కలిగిస్తుంది.
కొవ్వు ఆహారాలు: ఫ్రైడ్ ఫుడ్స్, రెడ్ మీట్ వంటి కొవ్వు ఆహారాలు లివర్‌కు హాని కలిగిస్తాయి.
ఆల్కహాల్: ఆల్కహాల్ లివర్‌కు చాలా హాని కలిగిస్తుంది.

Read more: KTR Case: నేను సాదాసీదా వ్యక్తి కాదు.. కొండా సురేఖను శిక్షించాల్సిందే: కోర్టులో కేటీఆర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News