Dragon Fruit For Diabetes: డయాబెటిస్ అనే ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యాధిగా మారింది. ప్రతి సంవత్సర ఈ వ్యాధి బారిన 100 మందిలో 20 మందని పడుతున్నారని ఇటీవలే WHO పరిశోధనల్లో తెలింది. డయాబెటిస్ బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజు శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహార నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మధుమేహంతో బాధపడే వారు సులభంగా గుండెపోటు, కిడ్నీ సమస్యల బారిన పడే ఛాన్స్‌లు ఎక్కువ..కాబట్టి ప్రతి రోజు రక్తంలో చక్కెర పరిమాణాలు పెరగకుంగా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
పండ్లను తీసుకోవడం వల్ల తీవ్ర మధుమేహం నుంచి ఉపశమనం లభిస్తుందా?
మధుమేహంతో బాధపడేవారు ప్రతి రోజు డ్రాగన్ ఫ్రూట్‌ను తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు మధుమేహం ఉన్నవారికి ఔషధంగా సహాయపడతాయట..100 గ్రాములలో ఈ పండులో 60 గ్రాముల ఆరోగ్యకరమైన కేలరీలు, జీరో ఫ్యాట్, 13 గ్రాముల పిండి పదార్థాలతో పాటు 3 గ్రాముల ఫైబర్ కూడా లభిస్తుంది. కాబట్టి ఈ పండును ప్రతి రోజు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
ఈ పండ్లు ఎక్కువ దక్షిణ మెక్సికో, అమెరికా దేశాలలో వినియోగిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా కూడా వీటి విక్రయాలు భారీగా పెరిగిపోయాయి. ఈ పండు చూడడానికి గలాబీ రంగును కలిగి ఉంటుంది. అంతేకాకుండా లోపల చిన్న చిన్న గింజలతో తెల్లని గుజ్జు ఉంటుంది. అయితే ఈ పండును మధుమేహంతో బాధపడేవారు ప్రతి రోజు తీసుకోవచ్చు. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.
డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెర స్థాయిని ఎలా తగ్గిస్తుదో తెలుసా?:
డ్రాగన్ ఫ్రూట్ కాక్టస్ జాతికి చెందిన ఓ సాధారణమైన మొక్క..అయితే ఈ మొక్కను అన్ని రకాల జంతువులపై పరిశోధన చేయగా..ఇందులో యాంటీ-డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయని తెలింది. అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు శరీరంలోని పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా సులభంగా కరిగిస్తుంది. దీంతో పాటు రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రిస్తుందని పరిశోధనల్లో తెలింది. ప్రీడయాబెటిస్, టైప్-2 మధుమేహంతో బాధపడేవారు ఈ పండును ప్రతి రోజు తీససుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణల, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి