Parboiled Rice: బ్రౌన్ రైస్ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రతిరోజు ఈ బియ్యాన్ని ఆహారంలో తీసుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడుతున్న వారు ఈ బ్రౌన్ రైస్ ను డైట్ లో భాగంగా చేర్చుకుంటే రక్తంలోని చక్కర పరిమాణాలు సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా ఇందులో అధిక పరిమాణంలో పోషకాలు లభిస్తాయి.
కాబట్టి గుండె వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పారాబాయిల్డ్ రైస్ ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో థయామిన్, నియాసిన్ పరిమాణంలో లభిస్తాయి. బట్టి ప్రతిరోజు వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా రకాల లాభాలు కలుగుతాయి. పారాబాయిల్డ్ రైస్ ప్రతిరోజు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Also read: Post Office Schemes: రోజుకు 50 రూపాయలు పెట్టుబడి చాలు, 35 లక్షలు సంపాదించే అవకాశం
పారాబాయిల్డ్ రైస్ ను తయారు చేయడానికి వడ్లను పొట్టుతోపాటు ఆవిరి పట్టించి ఉడికిస్తారు. ఇలా చేయడం వల్ల బియ్యానికి పచ్చదనం లభించి..పోషకాల విలువలు మరింత పెరుగుతాయి. కాబట్టి వీటిని ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించే గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు వీటిని ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ పారాబాయిల్డ్ రైస్ గ్లైసమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. మధుమేహం నుంచి ఉపశమనం పొందడానికి ఈ రైస్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ రైస్ లో విటమిన్ బి కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. విటమిన్ లోపం సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఆహారంలో ఈ రైస్ ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని కూడా దృఢంగా చేసేందుకు సహాయపడతాయి. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ బాయిల్డ్ రైస్ రోజుకు రెండు పూటల తీసుకోవాల్సి ఉంటుంది.
Also read: Post Office Schemes: రోజుకు 50 రూపాయలు పెట్టుబడి చాలు, 35 లక్షలు సంపాదించే అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook