ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉంటానికి విటమిన్స్ అవసరం. కానీ పురుషులకు కావాల్సిన విటమిన్స్ మరియు మహిళలకు కావాల్సిన విటమిన్లు వేరుగా ఉంటాయి. ఎందుకంటే.. మహిళల్లో ఉండే కొన్ని శారీరక సమస్యలు పురుషులకు బిన్నంగా ఉంటాయి. కావున మహిళలు రోజువారీ డైట్ లో కొన్ని ముఖ్యమైన విటమిన్ల చేర్చుకోవడం ఎంతో అవసరం.
మహిళల కావాల్సిన విటమిన్లు
మహిళల- పురుషుల శరీరం అనేక సందర్భాల్లో భిన్నంగా స్పందిస్తుంది. కావున మహిళల శరీరానికి భిన్నమైన పోషకాల అవసరం ఉంటుంది. సాధారణంగా.. మన ఇంట్లో ఉండే ఆడవాళ్లు చివరగా తింటారు మరియు కుటుంబం అంతా తిన్న తరువాత మిగిలిన ఆహారాన్ని తినాల్సి వస్తుంది. వారి శరీరానికి కావలసిన పోషకాలు సరిగా అందవు. దీని వలన మహిళలకు ఎంతో నష్టం కలుగుతుంది. రోజంతా పని చేసే మహిళలు ఆరోగ్యకరమైన మరియు తాజా ఆహారం తినడం ఎంతో అవసరం. గ్రేటర్ నోయిడాలోని GIMS హాస్పిటల్‌లో పనిచేస్తున్న ప్రముఖ డైటీషియన్ డాక్టర్ ఆయుషి యాదవ్ గారు మహిళల వికాసానికి మరియు వారి ఆరోగ్యానికి ఉపయోగపడే కొన్ని విటమిన్ల గురించి తెలిపారు.
విటమిన్ A
మహిళలకు 40 నుండి 45 సంవత్సరాల వయస్సు రాగానే వారిలో మెనోపాజ్ ప్రారంభమవుతుంది. దీని వలన వారి శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. విటమిన్ A సహాయంతో ఈ సమస్యలను అధిగమించవచ్చు. విటమిన్ A క్యారెట్, పాలకూర, గుమ్మడి గింజలు మరియు బొప్పాయిలో పుష్కలంగా ఉంటాయి.
విటమిన్ B9
గర్భిణీ మహిళలకు విటమిన్ B9 అనగా ఫోలిక్ ఆసిడ్ ఎంతో ముఖ్యమైన పోషకం. గర్భిణీల్లో విటమిన్ B9 లోపం ఉంటే.. కనుక జనన సమస్యలు కలిగే అవకాశం కూడా ఉంది. కావున మహిళలు రోజువారీ ఆహారంలో విటమిన్ B9 అధికంగా ఉండే ఈస్ట్, బీన్స్ మరియు ధాన్యాలను వారి డైట్ లో చేర్చుకోవాలి.
Also Read: Reasons Behind IND VS BAN Match Defeat: బంగ్లాదేశ్ చేతిలో ఓటమికి వీళ్లే కారణమా ?
విటమిన్ D
శరీరంలో ఎముకలు బలంగా ఉండాలంటే.. విటమిన్ D అవసరం. మన అందరిలో వయసు పెరుగుతున్న కొలది ఎముకలు బలహీనపడటం ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా మహిళలు కాల్షియంతో పాటు విటమిన్ D తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. దీని కోసం రోజులో ఒక 15 నుంచి 30 నిమిషాలు ఎండలో గడపడంతో పాటు, పాలు, చీజ్, పుట్టగొడుగులు, కొవ్వు చేపలు మరియు గుడ్లు వంటి వాటిని కూడా తినాలి.
విటమిన్ E
మహిళల్లో చర్మం, జుట్టు మరియు గోర్లు అందంగా మరియు బలంగా ఉండాలంటే విటమిన్ E అవసరం. అంతేకాకుండా విటమిన్ E వలన
చర్మంపై ఉండే మచ్చలు మరియు ముడతలు కూడా మాయమవుతాయి. విటమిన్ E కోసం వేరుశెనగ, బాదం, పాలకూర వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి.
విటమిన్ K
మహిళల శరీరంలో విటమిన్ K తగిన మొత్తంలో లేకుంటే.. వారికి పీరియడ్స్ మరియు ప్రసవ సమయంలో రక్తస్రావం సమస్య ఎక్కువగా ఉంటుంది. విటమిన్ K పొందడానికి పచ్చి కూరగాయలు, సోయాబీన్ నూనెలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.
Also Read: Nipah Virus: నిఫా వైరస్ కరోనా కంటే ప్రమాదకరమా, ఐసీఎంఆర్ ఏమంటోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook