Fatty Liver Tips: ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే ఈ 4 పండ్లు అస్సలు తినకూడదు

How to remove fat from liver in Telugu: శరీరంలో గుండె, కిడ్నీలతో పాటు అతి ముఖ్యమైన మరో అంగం లివర్. లివర్ ఆరోగ్యంగా ఉన్నంతవరకు శరీరంలో ఏ ఇతర వ్యాధులు దరిచేరవు. అందుకే లివర్‌ను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. కానీ గత కొద్దికాలంగా ఫ్యాటీ లివర్ సమస్య అధికంగా కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 5, 2024, 05:58 PM IST
Fatty Liver Tips: ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే ఈ 4 పండ్లు అస్సలు తినకూడదు

How to remove fat from liver in Telugu: ఫ్యాటీ లివర్ అనేది కేవలం వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఏర్పడే సమస్య. ఈ సమస్య ఎంత సులభంగా నియంత్రించవచ్చో నిర్లక్ష్యం చేస్తే అంత ప్రమాదకరంగా మారుతుంది. ఫ్యాటీ లివర్ తగ్గించేందుకు బ్యాలెన్స్ డైట్ చాలా అవసరం. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లు పూర్తిగా మానేయాలి. ఆ వివరాలు మీ కోసం.

ఫ్యాటీ లివర్ అనేది ఎంత సులభంగా కన్పిస్తుందో అంతే ప్రమాదరమైంది. ఫ్యాటీ లివర్ అంటే లివర్‌లో కొవ్వు పేరుకుపోవడమే. ప్రారంభదశలో చాలా సులభంగా తగ్గించవచ్చు. అదే ఎక్కువకాలం నిర్లక్ష్యం చేస్తే మాత్రం లివర్ మార్పిడి వరకూ దారితీస్తుంది. చెడు ఆహారపు అలవాట్లు, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణం. మీక్కూడా ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే హెల్తీ ఫుడ్ మీ డైట్‌లో ఉండేట్టు చూసుకోవాలి. ముఖ్యంగా కొన్ని పండ్లను దూరం పెట్టాలి. ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం 4 పండ్లను ఫ్యాటీ లివర్ రోగులు తినకూడదు.

లీచి.. ఇదొక సహజసిద్ధమైన షుగర్ కంటెంట్ అధికంగా ఉండే ఫ్రూట్. ఫ్యాటీ లివర్ రోగులకు ఇది ప్రమాదకరం. ఎందుకంటే ఇందులో కేలరీలు, షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా తింటే స్థూలకాయం, ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతుంది. 

మామిడి పండ్లు

మామిడిని పండ్ల రారాజుగా పిలుస్తారు. రుచి పరంగా ఆరోగ్యపరంగా అద్భుతమైంది. కానీ ఇందులో కూడా నేచురల్ షుగర్ కంటెంట్ ఎక్కువ. ఈ షుగర్ కంటెంట్ కొవ్వును పెంచుతుంది. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవాళ్లు మామిడి పండ్లను తగ్గించాలి. లేదా దూరంగా ఉంటే మరీ మంచిది

డ్రై ఫ్రూట్స్

సాధారణంగా డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమని రోజూ క్రమం తప్పకుండా తీసుకోమని వైద్యులు సూచిస్తుంటారు. కానీ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవాళ్లు మాత్రం డ్రై ఫ్రూట్స్ పరిమితంగా తీసుకోవాలి. లేదా అసలు తీసుకోకపోవడం మంచిది. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉండి ఫ్యాటీ లివర్ సమస్యను పెంచవచ్చు

శీతాఫలం

ప్రతి ఏటా శీతాకాలంలో మాత్రమే లభించే ఫ్రూట్ ఇది. ఫ్యాటీ లివర్ సమస్య  ఉంటే శీతాఫలాలు అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇందులో నేచురల్ షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఫ్యాటీ లివర్‌ను పెంచుతుంది. 

Also read: Floods Fear: విజయవాడలో మళ్లీ వరద భయం, ఇళ్లు వదిలి లాడ్జీల్లో నివాసముంటున్న ప్రజలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News