Green Tea Benefits: టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో దివ్యౌషధంగా గ్రీన్ టీ, ఎన్నిసార్లు తీసుకోవాలి

Green Tea Benefits: గ్రీన్ టీ చాలా సమస్యలకు పరిష్కారం, స్థూలకాయం తగ్గించుకునేందుకు..రక్తపోటు నియంత్రణకు ఇలా చాలా రాల ఆనారోగ్య సమస్యలు దూరం చేస్తుంది. డయాబెటిస్ నియంత్రణలో ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 26, 2022, 12:40 PM IST
Green Tea Benefits: టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో దివ్యౌషధంగా గ్రీన్ టీ, ఎన్నిసార్లు తీసుకోవాలి

Green Tea Benefits: గ్రీన్ టీ చాలా సమస్యలకు పరిష్కారం, స్థూలకాయం తగ్గించుకునేందుకు..రక్తపోటు నియంత్రణకు ఇలా చాలా రాల ఆనారోగ్య సమస్యలు దూరం చేస్తుంది. డయాబెటిస్ నియంత్రణలో ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. సన్నబడటానికి ఎక్కువగా గ్రీన్ టీ వాడుతుంటారు. అయితే గ్రీన్ టీ కేవలం డైటింగ్ కోసమే కాదు..ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనకరమని తెలుసా మీకు. గ్రీన్ టీ  రోజూ సేవిస్తే..గుండె పదికాలాలపాటు పదిలంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు క్రమం తప్పకుండా తీసుకుంటే..రక్తపోటు అదుపులో ఉంటుంది. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.

టైప్ 2 డయాబెటిస్‌కు అద్భుత పరిష్కారం

టైప్ 2 డ‌యాబెటిస్ఉన్న‌వారు ప్రతిరోజూ గ్రీన్ టీని సేవిస్తే..మీ శరీరంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఎందుకంటే గ్రీన్ టీలో కొటేకిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్క‌లంగా ఉంటుంది. మనిషి శరీరం..కార్బొహైడ్రేట్లను త్వరగా జీర్ణం చేయకుండా..నియంత్రిస్తాయి. ఫలితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ త‌గ్గుతుంది. బ‌రువు ఎప్పుడైతే తగ్గుతుందో..ఇన్సులిన్ రెసిస్టెన్స్ త‌గ్గుతుంది. శ‌రీరంలో ఉన్న ఇన్సులిన్ స‌రిగ్గా వినియోగం అవుతుంది. దీంతో ర‌క్తంలో షుగ‌ర్ లెవెల్స్ త‌గ్గుతాయి. ఈ విధంగా టైప్ 2 డ‌యాబెటిస్ అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు రోజూ 2-3 కప్పుల గ్రీన్ తాగితే మంచిది. 

అయితే గ్రీన్ టీ వైద్యుల సూచన లేకుండా మధుమేహం నియంత్రణకు వాడకూడదు. వైద్యుల సూచన మేరకే గ్రీన్ టీ తీసుకోవాలి. ఎందుకంటే గ్యాస్, ఎసిడిటీ , కెఫీన్ అలర్జీ ఉన్నవారికి గ్రీన్ టీ అంత మంచిది కాదు. మితంగా తీసుకోవాలి. గ్రీన్ తాగినప్పుడు ఏదైనా సమస్యగా అన్పిస్తే మానేయడం మంచిది.

డయాబెటిస్ సమస్య ఉన్నవారికి మాత్రం గ్రీన్ టీ ఓ దివ్యౌషధమే అనడంలో సందేహం లేదని వైద్యులు సూచిస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం గ్రీన్ టీ వివిధ రకాల రుచుల్లో లభిస్తోంది. గ్రీన్ టీ లెమన్, గ్రీన్ టీ హనీ, గ్రీన్ టీ జింజర్, గ్రీన్ టీ తులసి ఇలా చాలా రకాలున్నాయి. మన అవసరానికి తగ్గట్టుగా ఎంచుకోవాలి. 

Also read: Boiled Egg Benefits: రోజులో ఎన్ని గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరగదు..నిజంగా గుడ్లు తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News