Green Tea: గ్రీన్‌ టీతో ఎన్ని ప్రయోజనాలో.. మీరు తెలుసుకోండి!

Benefits Of Green Tea: గ్రీన్‌ టీ దీనిని చాలా మంది బరువు తగ్గడంలో ఉపయోగిస్తారు. దీని తీసుకోవడం వల్ల కేవలం బరువు సమస్య కాకుండా శరీరాకి కూడా ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2024, 06:26 PM IST
Green Tea: గ్రీన్‌ టీతో  ఎన్ని ప్రయోజనాలో.. మీరు తెలుసుకోండి!

Benefits Of Green Tea: గ్రీన్‌ టీ రోజు తీసుకోవడం వల్ల  ఎన్నో లాభాలను పొందవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు అధికంగా లభిస్తాయి. అయితే ఈ టీ కేవలం బరువు తగ్గించడంలోనే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.అయితే ఆ లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రీన్‌ టీ తీసుకోవడం వల్ల ఆహారం అరుగుదల బాగుంటుంది. అంతేకాకుండా మెదడు చురుకుగా పనిచేస్తుంది. 

క్యాన్సర్‌ సెల్స్‌ ఎక్కువగా పెరగకుండా చేస్తుంది. 

మనలో వచ్చే కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పి, దగ్గు, జలుబు నుంచి కూడా ఈ టీ సహాయపడుతుంది.

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడంలో గ్రీన్‌ టీ ఎంతో  మేలు చేస్తుంది.

శరీరంలోని కొవ్వులను కరిగించే శక్తి ఈ గ్రీన్‌ టీలో ఉంటుంది. 

తీవ్రమైన మానసిక ఒత్తిడిని నుంచి ఉపశమనం పొందడంలో ఈ గ్రీన్‌ టీ సహాయపడుతుంది.

Also Read Rotis For Diabetics: ఒక రోజు ముందు చేసిన రోటీలను డయాబెటిస్ ఉన్నవారు తింటే జరిగేది ఇదే!

గ్రీన్‌ టీ తాగడం వల్ల టైప్‌-2 డయాబెటీస్‌ వచ్చే రిస్క్‌ తగ్గుతుందని కొన్ని పరిశోధనల వల్ల తెలుస్తోంది.

గ్రీన్ టీ వల్ల హైబీపీ కూడా రాకుండా చూస్తుంది. 

హెయిర్‌ సెల్స్‌ని స్టిమ్ములేట్‌ చేయడంలో గ్రీన్‌ టీ ఎంతో మేలు చేస్తుంది.

గ్రీన్ టీ  గుండె సంబంధిత వ్యాధులను రాకుండా ఆపుతుంది.

అంతేకాకుండా జీవక్రియ వ్యాధులను తగ్గిచడంలో కూడా ఈ గ్రీన్ టీ సహాయపడుతుంది.

చిగుళ్ల, దంత సమస్య,  చెడుశ్వాస వంటి  లక్షణాల పై గ్రీన్ టీ  ప్రభావవంతంగా పని చేస్తుంది.

విటమిన్ బి, సి, ఇలు గ్రీన్ టీలో సమృద్ధిగా లభిస్తాయి.

గ్రీన్ టీ తాగడం వల్ల డిప్రెషన్‌ సమస్య తగ్గుతుందని కొన్ని పరిశోధనలో తేలింది.

గ్రీన్ టీ మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడంలో సహాయపడుతుంది.

గ్రీన్ టీ శరీరంలోని తేమను రోజంతా ఉంచడంలో సహాయపడుతుంది.

ప్రతి రోజు ఒక కప్పు గ్రీన్ టీ తాగటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మీరు కూడా ప్రతిరోజు మీ డైట్‌లో ఈ గ్రీన్‌ టీ తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Also Read Brown Rice Benefits: మీరు వైట్‌ రైస్‌ తీసుకుంటున్నారా? అయితే ఇవి తప్పకుండా తెలుసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News