H3N2 Virus Alert: హెచ్3ఎన్2 వైరస్ కిడ్నీలపై దుష్ప్రభావం చూపిస్తోందా, వైద్యులు ఏమంటున్నారు

H3N2 Virus Alert: దేశంలో ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్ కలకలం సృష్టిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య నెమ్మది నెమ్మదిగా పెరుగుతోంది. మరోవైపు ఈ కొత్త వైరస్ కిడ్నీలపై ప్రభావం చూపిస్తోందనే హెచ్చరికకు ఆందోళన కల్గిస్తున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 15, 2023, 07:22 PM IST
H3N2 Virus Alert: హెచ్3ఎన్2 వైరస్ కిడ్నీలపై దుష్ప్రభావం చూపిస్తోందా, వైద్యులు ఏమంటున్నారు

H3N2 Virus Alert: కరోనా వైరస్ నుంచి కోలుకున్నామని ఊపిరి పీల్చుకునేలోగా హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ దాడి చేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 11 మంది కొత్త వైరస్ కారణంగా మరణించినట్టు సమాచారం. మరోవైపు కిడ్నీలపై నేరుగా ఈ వైరస్ ప్రభావం చూపిస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

కోవిడ్ 19 తరువాత దేశంలో హెచ్3ఎన్2 కేసులు పెరుగుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఆందోళన కల్గిస్తున్నాయి. తేలికపాటి వ్యాధిగానే గుర్తించినా..ఇతర అనారోగ్య సమస్యలున్నవారికి మాత్రం ముప్పుగా పరిణమిస్తోందని తెలుస్తోంది. ఇతర ఇన్‌ఫ్లుయెంజా వ్యాధులతో పోలిస్తే హెచ్3ఎన్2 సోకిన రోగులు ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ వైరస్ అరికట్టేందుకు కరోనా మహమ్మారి విషయంలో తీసుకున్న జాగ్రత్తలన్నీ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే చిన్నారుల్లో, శిశువుల్లో ఈ వ్యాధి తీవ్రత అధికంగా కన్పిస్తోంది. చాలా కేసుల్లో ఐసీయూ చికిత్స అవసరమౌతోంది. చిన్నారుల్లో శ్వాస ఆడకపోవడం, దగ్గు, జ్వరం, నిమోనియా వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి.

ఇప్పటికే పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో హెచ్3ఎన్2 వైరస్ కారణంగా విద్యా సంస్థల్ని మార్చ్ 16 నుంచి మార్చ్ 26 వరకూ మూసివేసింది అక్కడి ప్రభుత్వం. ముఖ్యంగా 1 నుంచి 8వ తరగతి పాఠశాలల్ని పదిరోజుల వరకూ పూర్తిగా మూసివేస్తున్నట్టు వెల్లడించింది. 

కిడ్నీలపై ప్రభావం చూపిస్తోందా

హెచ్3ఎన్2 అంతగా ప్రాణాంతకం కాకపోయినా నేరుగా కిడ్నీలపై ప్రభావం చూపిస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధుల్లో ఈ సమస్య కన్పిస్తోంది. దీర్ఘకాలంగా డయాబెటిస్, హైపర్ టెన్షన్, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ వ్యాధులతో ఉన్నవారిలో తీవ్రంగా ఉంటోంది. కిడ్నీలపై విభిన్నమైన దుష్ప్రభావాన్ని చూపిస్తోంది. ఇన్‌ఫ్లుయెంజాతో తీవ్ర అనారోగ్యానికి గురైనవారిలో కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు ఉండవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

వయస్సు పైబడిన రోగుల్లో ఈ ముప్పు ఎక్కువగా ఉందని సమాచారం. కిడ్నీ మార్పిడి, డయాలసిస్ రోగుల్లో ముప్పు మరింత ఎక్కువగా ఉంది. సెకండరీ బ్యాక్టీరియల్ నిమోనియా ప్రభావం కన్పిస్తోంది.హెచ్3న్2 వైరస్ నిర్లక్ష్యం చేస్తే భారీగా మరణాలు తప్పవనేది మరో హెచ్చరిక.

Also read: Constipation Problem: మలబద్ధకం సమస్య భాదిస్తోందా, రోజూ ఈ రెండు ఆసనాలు వేస్తే చాలు ఇట్టే మాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News