Hair Care Tips: జుట్టు సమస్యల నుంచి విముక్తి పొందాలనుకుంటున్నారా..ఈ చిట్కాను ట్రై చేయండి..!!

Hair Care Tips: మారుతున్న జీవన శైలి కారణంగా ఎక్కువ ఒత్తిడికి గురై జుట్టు సమస్యలు బారిన పడుతున్నారు. చాలా మంది జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం, చివర్లు చీలిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలు పిల్లలలో కూడా వస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 29, 2022, 08:37 PM IST
  • జుట్టు సమస్యల నుంచి విముక్తి
  • జుట్టు సమస్యల విముక్తి ఉల్లిపాయ రసాం
  • ఉల్లిపాయ రసంతో జుట్టు చాలా ప్రయోజనాలు
Hair Care Tips: జుట్టు సమస్యల నుంచి విముక్తి పొందాలనుకుంటున్నారా..ఈ చిట్కాను ట్రై చేయండి..!!

Hair Care Tips: మారుతున్న జీవన శైలి కారణంగా ఎక్కువ ఒత్తిడికి గురై జుట్టు సమస్యలు బారిన పడుతున్నారు. చాలా మంది జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం, చివర్లు చీలిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలు పిల్లలలో కూడా వస్తున్నాయి.  దీనికి ప్రధాన కారణం శరీరంలో పోషకాలు తగ్గడమేనని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి  ఇంట్లో ఉండే వస్తువులను కూడా ఉపయోగించవచ్చు. ఇంటి చిట్కాల ద్వారా విముక్తి ఎలా పొందాలో తెలుసుకుందాం.

ఉల్లిపాయ రసాం:

జట్టు సమస్యల నుంచి విముక్తి పొందడానికి  ఉల్లిపాయ రసం  ప్రయోజనకరంగా ఉంటుంది.

1. ఇది జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.  ఉల్లిపాయలో ఉండే పోషకాలు యాంటీ బ్యాక్టీరియల్ స్కాల్ప్‌ను ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడానికి ప్రభావవంతంగా పని చేస్తాయి.

2. జుట్టు రాలడం వంటి సమస్యలతో ఇబ్బంది పడే వారు ఉల్లిపాయ రసాన్ని తప్పకుండా వాడమని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఉల్లిపాయ రసంలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టుకు అవసరమైన పోషణను అందించి.. జుట్టును బలంగా చేస్తుంది.

3. ఉల్లిపాయ రసంతో జుట్టుకు రెగ్యులర్‌గా మసాజ్ చేస్తే జుట్టు నెరిసే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా జుట్టు మళ్లీ పెరగడం ప్రారంభమవుతుంది.

జుట్టుకు ఉల్లిపాయ రసం ఎలా అప్లై చేయాలి:

జుట్టుకు ఉల్లిపాయ రసంతో తయారు చేసిన షాంపూ, కండీషనర్ ఉపయోగించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అయితే చిట్కా కోసం.. ఉల్లిపాయ తురుమి.. దాని రసాన్ని తీయాలి. ఈ రసాన్ని వారానికి రెండు మూడు సార్లు జుట్టు అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల జట్టు సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.

Also Read: Pawan Kalyan: నల్గొండ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన.. తెలంగాణ రాజకీయాల్లో కాక

Also Read: Benefits Of Taro Root: చేమ దుంపతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయే తెలుసా..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

 

Trending News