Coconut Sugar: పంచదార రుచికి ఎంత తీపిగా ఉంటుందో ఆరోగ్యానిక్ అంతే ప్రమాదకరం. మధుమేహం వ్యాధిగ్రస్థులకు, అధిక బరువుతో బాధపడేవారికి ఇలా చాలా మందికి పంచదార కానీ పంచదారతో తయారయ్యే స్వీట్స్ గానీ ప్రమాదకరమనే చెప్పాలి. అందుకే వైద్యులు పంచదారకు దూరంగా ఉండమంటారు.
ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడూ కొన్ని పదార్ధాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు. అందులో ముఖ్యమైంది పంచదార లేదా స్వీట్స్. పంచదార ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. టైప్ 2 డయాబెటిస్ , స్థూలకాయం, ఇతర వ్యాధులకు కారణమౌతుంది. అయితే పంచదారకు ప్రత్యామ్నాయంగా అందుబాటులో వచ్చిన కోకోనట్ షుగర్ గురించి తెలుసా మీకు. కోకోనట్ షుగర్ లేదా పామ్ షుగర్ బ్రౌన్ రంగులో ఉండి ఆరోగ్యానికి చాలా మేలు కల్గిస్తుంది. పంచదారతో పోలిస్తే కోకోనట్ షుగర్ చాలా మంచిదంటారు ఆరోగ్య నిపుణులు.
కోకోనట్ షుగర్ అనేది సహజసిద్ధమైన స్వీట్ ఫ్లేవర్ కలిగి ఉంటుంది. ఇందులో ప్రత్యేకమైన క్యారమైల్ లాంటి రుచి ఉంటుంది. కోకోనట్ షుగర్‌తో చాలా రకాల డ్రింక్స్, స్వీట్స్ తయారు చేస్తుంటారు. సాధారణ పంచదారలానే స్వీట్‌గా ఉంటుంది కానీ ఆరోగ్యానికి అంత హాని కల్గించదు.
కోకోనట్ షుగర్ తయారైన తరువాత కూడా ఇందులో కొబ్బరిలో ఉండే పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇందులో ఐరన్, కాల్షియం, పొటాషియం, జింక్ వంటి మినరల్స్ పెద్దమొత్తంలో ఉంటాయి. ఈ పోషకాలతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. న్యూట్రియంట్లతో నిండి ఉండటం వల్ల ఆరోగ్యానికి హాని కలగదు.
పంచదారతో పోలిస్తే కోకోనట్ షుగర్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అందుకే మధుమేహం వ్యాదిగ్రస్థులు కూడా తీసుకోవచ్చు. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవు. కేవలం మధుమేహం వ్యాదిగ్రస్థులే కాకుండా సాధారణ వ్యక్తులు కూడా కోకోనట్ షుగర్ వినియోగిస్తే ఆరోగ్యానికి చాలా మంచిదంటారు. దీనివల్ల మదుమేహం ముప్పు అనేది ఉండదు.
అయితే కోకోనట్ షుగర్ కూడా స్వీట్ కంటెంట్ అయినందున ఎక్కువగా వినియోగించకూడదు. ఆరోగ్యపరంగా ప్రయోజనకమైనా సరే ఎక్కువ మోతాదులో సేవించకూడదు. ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడం, పళ్లు కుళ్లిపోవడం, ఇతర వ్యాధులు ఉత్పన్నం కావచ్చు.
Also read: Low Sodium Diet: శరీరంలో తగినంత సోడియం లేకుంటే ఏం జరుగుతుందంటే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Coconut Sugar: పంచదార కంటే కోకోనట్ షుగర్ ఏ విధంగా మంచిది, లాభాలేంటి