Health Benefits of Napping: మధ్యాహ్నం భోజనం చేశాక ఎందుకో తెలియదు కానీ కాస్త బద్దకంగా ఉంటుంది. స్కూలు విద్యార్థుల నుంచి జాబ్ చేసే ఉద్యోగుల వరకు అందరి నోటా ఈ మాట వింటూనే ఉంటాం. అయితే మధ్యాహ్నం ఓ చిన్న కునుకు (NAP)తీస్తే బాగుంటుంది అనుకుంటారు. నిజమే.. భోజనం తర్వాత నిద్ర ఆరోగ్యానికి శ్రేయస్కరమా లేక హాని చేస్తాయా అంటే ఈ విషయాలు తెలుసుకోవాలి.
మధ్యాహ్నం భోజనం తర్వాత కాస్త కునుకు తీయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం కునుకు తీస్తే రాత్రి నిద్రరాదేమోనని కొందరు భావిస్తారని, అందులో నిజం లేదని తెలుసుకోవాలి. ఆరోగ్యవంతులు గరిష్టంగా 25-30 నిమిషాలు నిద్రించవచ్చు. చిన్న పిల్లలు, వృద్ధులు ఓ గంట సమయం వరకు కనుకు తీయవచ్చు. మధ్యాహ్నం నిద్ర(Sleeping)తో ఎంతో మానసిక ప్రశాంతత లభించి తాను ఎన్నో విజయాలు సాధించానని సాకర్ స్టార్ రొనాల్డో ఎన్నో సందర్భాలలో ప్రస్తావించడం తెలిసిందే.
Also Read: స్మోకింగ్ చేస్తున్నారా.. ఇకనుంచి వారికి నిషేధం, కొత్త రూల్స్ ఇవే!
మధ్యాహ్నం నిద్ర(NAP) వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
- మధ్యాహ్నం చిన్న కునుకు తీస్తే జీర్ణక్రియ మెరుగవుతుంది
- ఒత్తిడిని మరిచి నిద్రిస్తారు కనుక హైబీపీని సైతం నియంత్రిస్తుంది.
- డయాబెటిస్(Diabetes), పీసీఓడీ, థైరాయిడ్ సమస్యలకు చిన్న పరిష్కారం
- హార్మన్ల సమతౌల్యత పెరుగుతుంది. హోర్మోన్లు చక్కగా పనిచేస్తాయి.
- స్థూలకాయ సమస్య నుంచి బయటపడవచ్చు
- అనారోగ్యం నుంచి కోలుకునేందుకు ఉపకరిస్తుంది.
- చెడు కొవ్వును కరుగుతుంది
Also Read: Health Tips: ఆరోగ్యంగా జీవించాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook