చాలామందికి ఆయిలీ, స్పైసీ ఫుడ్స్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఈ ఇష్టమే అనారోగ్యానికి దారితీస్తుంటుంది. ఈ రకమైన ఆహార పదార్ధాలు తినడం వల్ల ఛాతీలో మంట సమస్య ఉత్పన్నమౌతుంది. మరి ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలనేది తెలుసుకుందాం..
ఇష్టంగా తినే ఆయిలీ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ వల్ల ఎసిడిటీ, ఛాతీలో మంట అనేది సాధారణంగా కన్పించే లక్షణం. ఈ సమస్య ఉన్నప్పుడు నీళ్లు ఎక్కువగా తాగుతుంటాం. గొంతులో, ఛాతీలో మంటతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అల్లోపతి వైద్యంలో దీనికి చాలా మందులున్నా..ఒక హోమ్ రెమెడీ కూడా ఉంది. ఈ చిట్కాతో అద్భుతంగా నయం చేయవచ్చు.
ఉసిరితో ఛాతీలో మంట నుంచి ఉపశమనం
ఆయుర్వేదంలో ఉసిరి గురించి చాలా ప్రస్తావన ఉంది. ఉసిరి తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. శరీరం అందం పెంచేందుకు ఉసిరిని విరివిగా ఉపయోగిస్తారు. ఉసిరితో కేశాలు, చర్మానికి ప్రయోజనకరం. అయితే ఇదే ఉసిరితో ఎసిడిటీ, ఛాతీలో మంట సమస్యలు తొలగుతాయి.
ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోతే..కడుపులో వేడిమి పెరుగుతుంది. ఛాతీలో మంట పుడుతుంది. ఈ రెండు సమస్యల్ని తొలగించేందుకు ఉసిరి పౌడర్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఉసిరి పౌడర్‌తో కొన్ని క్షణాల్లోనే ఈ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. ఉసిరి అనేది ఏడాది మొత్తం లభిస్తుంది. దాంతోపాటు ఉసిరి పౌడర్ కూడా మార్కెట్‌లో విరివిగా లభిస్తుంది. ఉసిరి శరీరంలోని విష పదార్ధాల్ని బయటకు పంపించేస్తుంది.
ఉసిరి పౌడర్ ఎలా ఉపయోగించాలి
రాత్రి వేళ నిద్రించేముందు ఒక గ్లాసు నీళ్లలో ఉసిరి పౌడర్ నానబెట్టాలి. ఉదయం లేచిన తరువాత వడకాచి తాగాలి. కడుపులో వేడిమి, ఎసిడిటీ, ఛాతీలో మంట ఉంటాయి. ఒకరోజులో ఈ సమస్య నుంచి ఉపశమనం లేకపోతే..రెండవరోజు కూడా ప్రయత్నించాలి. ఉసిరి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. గ్యాస్ సమస్య పోతుంది.
Also read: Healthy Liver Tips: దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా బతకాలంటే..ఈ 5 పదార్ధాలు మానేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Faceboo