Amla Health Benefits: ఆయుర్వేదం ప్రకారం ఉసిరి ఓ దివ్యౌషధం. శరీరంలో అన్ని రుగ్మతలకు ఇదే పరిష్కారం. ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు ఓ వరం లాంటిది. మధుమేహ నియంత్రణలో ఉసిరి ఎలా పనిచేస్తుందనేది తెలుసుకుందాం..
ప్రకృతిలో విరివిగా లభించే ఉసిరిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఉసిరి ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. తల వెంట్రుకల్నించి ఇమ్యూనిటీ వరకూ ఉసిరి తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. అటు డయాబెటిస్ రోగులకు కూడా ఉసిరి వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. డయాబటిస్ రోగుల్లో హఠాత్తుగా కన్పించే స్పైక్స్‌ను ఉసిరి నియంత్రిస్తుంది. దాంతోపాటు డయాబెటిస్ రోగుల్లో మెటబోలిజంను మెరుగుపరుస్తుంది. ఇతర అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది. అందుకే ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ఉసిరిని ఓ దివ్యౌషధంగా భావిస్తారు.
ఉసిరి తాలింపు
ఉసిరి తాలింపుగా చేసుకుంటే ఇష్టంగా తినవచ్చు. ముందుగా 7-8 ఉసిరికాయల్ని తీసుకుని ఉడికించాలి. చల్లారిన తరువాత గింజలు వేరు చేయాలి. ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెమ్మలు, 1-2 పచ్చిమిర్చిలు తీసుకుని పాన్‌పై వేడి చేసి..దంచి పెట్టుకోవాలి. ఉడికించిన ఉసిరి ముక్కల్లో దంచిన వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇందులో ఒక స్పూన్ గానుగ నూనె కలపాలి. చివరిగా కొద్దిగా ఉప్పు, కొత్తిమీర వేసి తినాలి.
మధుమేహం అనేది చాలా ప్రమాదకరమైంది. ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి. ఉసిరిని మామూలుగా తినేకంటే ఇలా ఉసిరి తాలింపులా తీసుకుంటే..కళ్లపై డయాబెటిస్ ప్రభావం తగ్గుతుంది. ఇతర అనారోగ్య సమస్యల్ని కూడా దూరం చేస్తుంది. ఉసిరి తాలింపులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల డయాబెటిస్ రోగుల్లో కన్పించే కడుపు సంబంధిత సమస్యలు దూరమౌతాయి. క్రమం తప్పకుండా ఉసిరి తాలింపు తీసుకోవడం వల్ల బాడీ మెటబోలిజం మెరుగుపడుతుంది.
Also read: Healthy Weight Loss: అత్యంత సహజంగా, ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే ఏం చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook