Uric Acid Levels: అందరూ నిర్లక్ష్యం వహించే ఇది చాలా ప్రమాదకరం

Uric Acid Levels: ఆరోగ్యంగా ఉండాలంటే చాలా పరిమాణాలు సరిగ్గా ఉండాలి. అందులో ముఖ్యమైంది యూరిక్ యాసిడ్. మనిషి శరీరంలో ఇది కచ్చితంగా నియంత్రణలో ఉండాలి. లేకపోతే పలు ఇబ్బందులు ఎదురౌతాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 8, 2022, 12:21 AM IST
Uric Acid Levels: అందరూ నిర్లక్ష్యం వహించే ఇది చాలా ప్రమాదకరం

శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిందంటే...అర్ధం శరీరం నంచి విష పదార్ధాలు బయటకు వెళ్లలేకపోతున్నారని అర్ధం. యూరిక్ యాసిడ్ పెరిగితే..పలు అనారోగ్య సమస్యలు దారి తీస్తుంది. కొన్ని వస్తువులు తినడం ద్వారా యూరిక్ యాసిడ్ నియంత్రించుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం..

యూరిక్ యాసిడ్ స్థాయి ఎప్పుడూ మనిషి శరీరంలో నియంత్రణలో ఉండాలి. తగిన మోతాదులో లేకపోతే వివిధ రకాల సమస్యలు వెంటాడుతాయి. శరీరం నుంచి విష పదార్ధాల తొలగింపు ప్రక్రియ సరిగ్గా లేకుంటే..యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది. ఫలితంగా వివిధ రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. సరైన డైట్ క్రమపద్ధతిలో ఉంటే యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. ఎలాంటి ఆహార పదార్ధాలు తీసుకుంటే యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుందో తెలుసుకుందాం..

ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్ధాల్ని ఎంచుకోవాలి. క్రమం తప్పకుండా డైట్‌లో భాగంగా చేసుకోవాలి. బ్రోకలీ, ఆనపకాయ, వాము, తృణ ధాన్యాల్ని తినడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. ఇక రెండవది పండ్లు, కూరగాయలు. ఇవి తినడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. అందుకే ప్రతిరోజూ మీ డైట్‌లో పండ్లు తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. అంతేకాకుండా కూరగాయలు కూడా మంచి ఫలితాలనిస్తాయి. పాలకూర, మటర్, కాలిఫ్లవర్, టొమాటో వంటి కూరగాయలు తప్పకుండా తీసుకోవాలి. యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గించేందుకు దోహదపడతాయి.

మూడవది డార్క్ చాకొలేట్. డార్క్ చాకొలేట్‌లో థియోబ్రోమైనా ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ తగ్గించేందుకు కీలకంగా ఉపయోగపడుతుంది. నాలుగవది విటమిన్ సి. దీనికోసం విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాల్ని డైట్‌లో భాగంగా చేసుకోవాలి. కేవలం 500 మిల్లీగ్రాముల విటమిన్ సితో..పెరిగిన యూరిక్ యాసిడ్ తగ్గించవచ్చని వివిధ పరిశోధనల్లో వెల్లడైంది. 

Also read: Hemoglobin: మీ బాడీలో రక్తం హిమోగ్లోబిన్ కొరత ఉందా..అయితే ఈ 5 సూపర్ ఫుడ్స్ తీసుకోవల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News