Diabetic Tips: మధుమేహాన్ని లైప్‌స్టైల్ డిసీజ్‌గా పరిగణిస్తారు. ఎందుకంటే వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలే డయాబెటిస్‌కు ప్రధాన కారణం. మధుమేహానికి ఇప్పటి వరకూ సరైన చికిత్స అందుబాటులో లేదు. కానీ నియంత్రణ మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది.
మధుమేహానికి చికిత్స లేదు గానీ నియంత్రణ సులభమే. రోజూ తగిన వ్యాయామం చేయడంతో పాటు హెల్తీఫుడ్ క్రమ పద్ధతిలో తీసుకోవాలి. అంతేకాకుండా కొన్ని అద్భుతమైన వంటింటి చిట్కాలు పాటిస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. అటువంటిదే ఈ నిమ్మకాయ చిట్కా. నిమ్మకాయలో సాధారణంగా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. సాధారణంగా ఎండాకాలంలో చాలామంది నిమ్మకాయ ఎక్కువగా వినియోగిస్తుంటారు. కానీ నిమ్మరసం ఎప్పుడైనా తాగవచ్చు. రోజూ పరగడుపున ఉదయం నిమ్మరసం ఉప్పుతో తాగితే బ్లుడ్ షుగర్ లెవెల్స్ అద్భుతంగా తగ్గుతాయంటున్నారు.
నిమ్మకాయలో పెద్దమొత్తంలో ఉండే విటమిన్ సి, పైబర్, యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ వేగంగా తగ్గుతాయి. నిమ్మకాయలో ఉండే పోషకాలు జీర్ణక్రియను పెంచుతాయి. ఇందులో కేలరీలు కూడా తక్కువ కావడంతో మదుమేహ వ్యాధిగ్రస్థులకు మంచిది. ఇందులో ఉండే విటమిన్ సి కారణంగా ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది.
ప్రతి రోజూ ఉదయం పరగడుపున గోరువెచ్చని నీళ్లతో నిమ్మరసం తాగడంతో పాటు మద్యాహ్నం, రాత్రి భోజనంలో కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే మంచి ఫలితాలుంటాయి. మీరు నీళ్లు తాగే వాటల్ బాటిల్‌లో చిన్న నిమ్మకాయ ముక్కల్ని ఉంచి తాగడం వల్ల శరీరంలోని విష పదార్ధాలు తొలగిపోతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. నిమ్మరసాన్ని సలాడ్ లేదా సూప్‌లో కలిపి కూడా తీసుకోవచ్చు. నిమ్మరసంతో అధిక బరువు సమస్య కూడా తొలగిపోతుంది.
Also read: Weight loss Drink: కొబ్బరి నీళ్లలో ఈ గింజలు కలిపి చూడండి, అద్బుతమే ఇక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook