Diabetes Tips: మధుమేహం ఆధునిక లైఫ్‌స్టైల్ వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైంది. నియంత్రణ ఎంత సులభమో నిర్లక్ష్యం వహిస్తే ఇతర అంగాలపై ప్రభావం చూపించి ప్రాణాంతకం కాగలదు. అందుకే ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ పరీక్షిస్తుండాలి. కొన్ని చిట్కాలు పాటిస్తే అసలు డయాబెటిస్ వ్యాధికి మందులు కూడా అవసరం లేదంటారు కొందరు వైద్యులు.
మధుమేహం నియంత్రణ పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఏది మంచిది ఏది తినకూడదనే వివరాలు తెలుసుకోవాలి. అవసరమైతే డైట్ ఛార్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ ఛార్ట్ ఆధారంగా ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా గ్లైసెమిక్స్ ఇండెక్స్ తక్కువగా ఉన్న పదార్ధాలు తీసుకుంటే మంచిది.
మధుమేహం నియంత్రణలో ముందుగా చేయాల్సింది వైట్ రైస్ దాదాపు మానేయాలి. వైట్ రైస్ స్థానంలో బ్రౌన్ రైస్ వాడితే మంచి ఫలితాలుంటాయి. బ్రౌన్ రైస్ అనేది కేవలం బరువు తగ్గేందుకే కాకుండా..డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యల వారికి చాలా ప్రయోజనకరం. మసాలా పదార్ధాలు, ఆయిలీ పదార్ధాలు, ఫ్రైడ్ పదార్దాలు, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ దూరం చేయాలి. పండ్ల విషయంలో మామిడి, సపోటా, అరటి, పనస, సీతాఫలం తినకూడదు. సిట్రస్ ఫ్రూట్స్ ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది. జామ మధుమేహం వ్యాధిగ్రస్థులు చాలా మంచిది. ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ లేదా పదార్ధాలు తీసుకోవాలి.
ఇక డైట్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటూనే కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలుంటాయి. దీనికోసం రాత్రి పూట మెంతుల్ని నానబెట్టి ఉదయం పరగడుపున ఆ మెంతుల్ని క్రష్ చేసి నీళ్లతో సహా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ నియంత్రణలో ఉంటుంది. మరో చిట్కా కలోంజి విత్తనాలు లేదా ఆయిల్. రోజూ ఉదయం పరగడుపున గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా కలోంజి విత్తనాలు లేదా ఆయిల్ కలుపుకుని తాగితే చాలా త్వరగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
ఇక మరో చిట్కా రోజూ ఉదయం పరగడుపున నేరేడు గింజల పౌడర్‌ను గోరు వెచ్చని నీళ్లలో కలిపి తాగడం అలవాటు చేసుకుంటే వారాల వ్యవధిలోనే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. మద్యాహ్నం కొద్దిగా రైస్ ఎక్కువ కూర వేసుకుని తింటూ, రాత్రి మాత్రం రోటీ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ రాత్రి 7 -8 గంటల మధ్య భోజనం పూర్తి చేసుకుని..8-10 గంటల మధ్య నిద్రకు ఉపక్రమించాలి. ప్రతిరోజూ తిన్న తరువాత కనీసం 7 నిమిషాలు లైట్ వాక్ అవసరం. రోజూ ఉదయం లేదా సాయంత్రం 20 నిమిషాలు వాకింగ్ చేయాలి.
ఈ అలవాట్లు క్రమం తప్పకుండా పాటిస్తే కచ్చితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. మధుమేహం మరీ ఎక్కువగా ఉంటే ఈ డైట్, అలవాట్లు పాటిస్తూ క్రమంగా మందుల వాడకాన్ని తగ్గించవచ్చు. ఏదేమైనా సరే మధుమేహం అనేది పూర్తిగా ఆహారపు అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది.
Also read: Kidneys Health: కిడ్నీ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టాలంటే డైట్‌లో ఈ మార్పులు తప్పవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook