Fatty Liver Symptoms on Face: ముఖంపై ఈ లక్షణాలుంటే మీ లివర్ అనారోగ్యంగా ఉందని అర్థం!

Fatty Liver Symptoms: మనిషి శరీరంలో అంతర్గతంగా జరిగే మార్పులు వివిధ లక్షణాల్లో బయటపడుతుంటాయి. శరీరంలోని ఏ అవయవంలో లోపం తలెత్తినా ఏదో రూపంలో ప్రతిబింబిస్తుంది. అందుకే ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదంటారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 8, 2023, 03:32 PM IST
Fatty Liver Symptoms on Face: ముఖంపై ఈ లక్షణాలుంటే మీ లివర్ అనారోగ్యంగా ఉందని అర్థం!

Fatty Liver Symptoms: మనిషి శరీరంలో గుండె, కిడ్నీలు ఎంత ముఖ్యమో లివర్ కూడా అంతే ముఖ్యం. లివర్ సమస్య తీవ్రమైతే ప్రాణాంతకం కాగలదు. లివర్ హెల్తీగా ఉండటం చాలా ముఖ్యం. లివర్ ఆరోగ్యంగా ఉందో లేదో ముఖంపై కన్పించే కొన్ని లక్షణాలతో తెలుసుకోవచ్చంటారు వైద్య నిపుణులు. ఆ వివరాలు మీ కోసం..

ఫ్యాటీ లివర్ అనేది ఇటీవలి కాలంలో ప్రధానంగా కన్పించే సమస్య. సాధారణంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఫ్యాటీ లివర్ సమస్య తలెత్తుతుంది. ముఖ్యంపై కన్పించే కొన్ని లక్షణాల ఆధారంగా ఫ్యాటీ లివర్ సమస్యను గుర్తించవచ్చు. ఈ పరిస్థితుల్లో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ సమస్య ఉంటే శరీరంలో చాలా లక్షణాలు కన్పిస్తాయి. కొన్ని ముఖంపై ప్రతిబింబిస్తాయి. ఈ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్య నుంచి సకాలంలో ఉపశమనం పొందవచ్చు. ప్యాటీ లివర్ సమస్య ఉంటే ముఖంపై ఏ విధమైన లక్షణాలు కన్పిస్తాయో చూద్దాం.

ముఖంపై కన్పించే లక్షణాలు

1. వ్యక్తి ముఖంపై పింపుల్స్, యాక్నే ఎక్కువగా ఉంటే ఫ్యాటీ లివర్ కారణం కావచ్చు. అంటే శరీరంలో హార్మోనల్ మార్పు జరుగుతుందని అర్ధం. ఈ పరిస్థితుల్లో ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ముఖంపై పింపుల్స్, యాక్నే అనేవి ఫ్యాటీ లివర్ లక్షణాల్లో ఒకటి.

2. వ్యక్తి ముఖంపై రెడ్ లైన్ కన్పిస్తుంటే ఆ వ్యక్తి లివర్‌లో ఏదో సమస్య ఉందని అర్ధం. ఈ పరిస్థితి కన్పిస్తే తక్షణం వైద్యుడిని సంప్రదించాలి. లేకపోతే ఈ సమస్య ప్రాణాంతకం కాగలదు.

3. ముఖం రంగు పసుపుగా మారుతుంటే లివర్ పాడయినట్టుగా అర్దం చేసుకోవాలి. ఈ లక్షణాలుంటే తక్షణం వైద్యుడిని సంప్రదించాలి. ముఖం పసుపుగా మారడం లేదా కళ్లలో పసుపుతనం కన్పించడం అనేది ఇతర సమస్య కూడా కావచ్చు. అందుకే లివర్ టెస్ట్ మంచిది. 

4. కంటి కింద స్వెల్లింగ్ సమస్య ఉంటే అది కూడా దీర్ఘకాలం ఉంటే లివర్ పాడయినట్టు అర్ధం. వాస్తవానికి కింటి కింద స్వెల్లింగ్ అనేది ఎక్కువ సేపు కంప్యూటర్ స్క్రీన్ వల్ల కూడా కావచ్చు. అదే ఈ సమస్య దీర్ఘకాలంగా ఉంటే మాత్రం ఫ్యాటీ లివర్ సమస్య అని తెలిసిపోతుంది.

Also Read: Flax seeds: ఫ్లక్స్‌సీడ్స్‌తో లాభాలే కాదు హాని కూడా, అతిగా తింటే కలిగే అనర్ధాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News