Kidney Stones: మనిషి శరీరంలో గుండె, కిడ్నీలు, లివర్ అతి ముఖ్యమైన అంగాలు. కిడ్నీలు విఫలమైతే అది ప్రాణాంతకమౌతుంది. కిడ్నీల అనారోగ్యం అంటే వివిధ వ్యాధులు చుట్టుముట్టినట్టే అర్ధం చేసుకోవాలి. కిడ్నీలో సమస్యలు చాలా రకాలుగా ఉంటాయి. ఇందులో ముఖ్యమైంది కిడ్నీలో రాళ్ల సమస్య.
మనిషి ఆరోగ్యం విలువ అనారోగ్యం పాలయినప్పుడే తెలుస్తుంది. కిడ్నీలు సక్రమంగా పనిచేసినంతకాలం వాటి విలువ చాలామందికి తెలియదు. ఆధునిక జీవనశైలిలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా కిడ్నీ సమస్యలు ఏర్పడుతుంటాయి. మనం తినే జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ వంటివి చాలా సందర్భాల్లో జీర్ణం కాకపోవడంతో వ్యర్ధాలు కిడ్నీలు పేరుకుపోయి..రాళ్లలా మారిపోతాయి. కిడ్నీలో రాళ్ల సమస్య చాలా ఎక్కువగా కన్పిస్తుంటుంది. ఇది వంశ పారంపర్యంగా వచ్చే సమస్య. కిడ్నీలో రాళ్లుంటే ఆ బాధ వర్ణణాతీతంగా ఉంటుంది. చాలా ఇబ్బంది కల్గించే సమస్య ఇది.
కిడ్నీలో రాళ్లుండటం వల్ల పొత్తి కడుపు నొప్పి తరచూ వస్తుంటుంది. మూత్రం పోసేటప్పుడు మంట తీవ్రంగా ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి చాలా కారణాలుంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో వంశ పారంపర్యం ఒకటైతే రెండవది ఆహారపు అలవాట్లు. మధుమేహం వ్యాధితో బాధపడేవారిలో ఈ సమస్య ఎక్కువగా చూడవచ్చు. బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉండేవారిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడేందుకు అవకాశాలెక్కువ.
రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేసే అలవాటుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నియంత్రించవచ్చు. వాకింగ్, వ్యాయామం అనేవి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. శరీరానికి సరిపడే నీరు తాగడం చాలా మంచిది. నీళ్లు తాగడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య దూరమౌతుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి.
అదే సమయంలో సాల్ట్ ఎక్కువగా ఉండే పదార్ధాలను తక్కువగా తీసుకోవాలి. లేకపోతే కిడ్నీలో రాళ్ల సమస్య రావడానికి అవకాశాలెక్కువ. స్థూలకాయం ఉండేవారిలో కూడా కిడ్నీలో రాళ్ల సమస్య అధికంగా ఉంటుంది. కిడ్నీలో ఒకసారి రాళ్లు ఏర్పడితే వెంటనే తగిన చికిత్స చేయించకపోతే పరిస్థితి ప్రమాదకరంగా మారవచ్చు.
Also read: Green Tea Side Effects: అతిగా గ్రీన్ టీలను తాగడం మంచిదేనా? తాగడం వల్ల ఏం జరుగుతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook