Strong Bone tips: మీ డైట్‌లో ఈ 9 పదార్ధాలుంటే చాలు, వృద్ధాప్యంలో సైతం మీ ఎముకలు ఉక్కులా ఉంటాయి

Strong Bone tips: జీవితం విలువ యుక్త వయస్సులోనే తెలుస్తుంది. ఎందుకంటే వయస్సు మీదపడే కొద్దీ వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే యౌవనంలో ఉన్నప్పుడే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడితే..వృద్ధాప్యం బాధించదంటారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 31, 2023, 12:36 PM IST
Strong Bone tips: మీ డైట్‌లో ఈ 9 పదార్ధాలుంటే చాలు, వృద్ధాప్యంలో సైతం మీ ఎముకలు ఉక్కులా ఉంటాయి

Strong Bone tips: సాధారణంగా వయసు పెరిగే కొద్దీ శరీరం ఫిట్‌నెస్ కోల్పోతుంటుంది. ఎముకలు పటుత్వం కోల్పోతాయి. ఏ పనీ చేయలేక నిస్సహాయులై ఉంటారు. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే యౌవనం నుంచే తగిన శ్రద్ధ ఉండాలి. ముఖ్యంగా హెల్తీ ఫుడ్ అనేది ముఖ్యం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వయస్సు పెరిగే కొద్దీ ఎముకల్లో పటుత్వం కోల్పోవడంతో నొప్పులు బాధిస్తుంటారు. కొద్దిపాటి పనికే తీవ్రమైన ఆలసట, నీరసం ఆవహిస్తుంటుంది. అయితే ఆధునిక జీవనశైలి కారణంగా యౌవనంలో కూడా ఈ పరిస్థితి కన్పిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్‌లో చాలా ప్రమాదకరం కావచ్చు. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా వృద్ధాప్యంలో కూడా ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలంటే డైట్‌లో తప్పనిసరిగా కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. డైట్‌లో మీరు చేసే మార్పుల ప్రభావం కచ్చితంగా కొన్ని రోజుల్లోనే కన్పిస్తుంది. 

శరీరంలో మీ ఎముకల పటుత్వం అనేది మీరు తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది. రోజూ తీసుకునే డైట్, తగినంత నిద్ర, వ్యాయామం, జీవనశైలి అన్నీ మీ ఆరోగ్యాన్ని నిర్ధారిస్తాయి. మానసికంగా బాగుంటే ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. సరైన డైట్ , జీవనశైలి కారణంగా ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి. ఎముకలు ఆరోగ్యంగా, స్ట్రాంగ్‌గా ఉండేందుకు డైట్ లో కొన్ని రకాల పదార్ధాలు తప్పకుండా ఉండాలి. 

బాదం, ఆకు కూరలు, ఫ్యాటీ ఫిష్, పెరుగు, ఆలివ్ ఆయిల్, అరటి, నారింజ, నువ్వులు, సోయా బీన్స్ డైట్‌లో తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. తృణధాన్యాల్లో కాల్షియం పెద్దగా ఉండదు. అదే సమయంలో జంతు మాంసం చికెన్, మటన్‌లో కూడా కాల్షియం ఆశించినంత ఉండదు. అందుకే వెజ్ , నాన్ వెజ్ రెండూ తింటే సమంగా ఉంటుంది. ప్యాకెట్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. వీటివల్ల అనారోగ్యం తప్ప మరే ఇతర ప్రయోజనం ఉండదు. 

అదే సమయంలో కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. మద్యం ఎక్కువగా తాగితే ఓస్టియోపోరోసిస్ ముప్పు పెరుగుతుంది. టీ, కాఫీలు తగ్గించకపోతే కెఫీన్ కాల్షియంను దూరం చేస్తుంది. ధూమపానానికి దూరంగా ఉంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. తీసకునే డైట్‌లో విటమిన్ డి3 ఉండేట్టు చూసుకోవాలి.

Also read: Dates Benefits: ఖర్జూర పండ్లలో చక్కెర పరిమాణాలు ఉంటాయని తినడం మానుకుంటే.. పప్పులో కాలేసినట్లే, ఎందుకో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News